Ambati Rambabu: పోలవరం గురించి దుష్టచతుష్టయం పుంఖానుపుంఖాలుగా విమర్శలు చేస్తున్నారు.. కానీ, పోలవరంపై మా ప్రభుత్వమే కీలకంగా దృష్టి పెట్టిందన్నారు మంత్రి అంబటి రాంబాబు.. పోలవరం.. వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు.. కానీ, టీడీపీ హయాంలో స్పిల్ వే సగంలో వదిలేశారు.. స్పిల్ వేను పూర్తి చేసిన ఘనత మాత్రం వైఎస్ జగన్ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. నదిని డైవర్ట్ చేసిన ఘనత కూడా జగన్ దే అన్న ఆయన.. డయాఫ్రమ్ వాల్ వరదల వల్ల కొట్టుకుపోలేదు.. చంద్రబాబు ప్రభుత్వం అనుచిత నిర్ణయాల వల్లే కొట్టుకుపోయిందని ఆరోపించారు. రెండు కాఫర్ డ్యాంలు పూర్తిగా కట్టిన తర్వాతే డయాఫ్రమ్ వాల్ కట్టాలి.. కానీ, చంద్రబాబు ఏం చేశాడు? దానికి విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు.. ఈ విషయాన్ని నేను నిరూపిస్తా.. ఛాలెంజ్ చేస్తున్నా.. నాతో చర్చకు రాగలరా? అంటూ బహిరంగ సవాల్ చేశారు అంబటి రాంబాబు.
Read Also: Rajinikanth: పాన్ ఇండియా దర్శకుడితో తలైవర్ సినిమా…
ఇక, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపణలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి అంబటి.. రాజ్యాంగ నిపుణుడు పయ్యావుల కొన్ని ఆరోపణలు చేశాడు అంటూ సెటైర్లు వేసిన ఆయన.. పయ్యావుల ఆరోపణలు అవాస్తవం.. వీటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నా.. కానీ, సమాధానం ఇవ్వకపోతే నేరం అంగీకరించినట్లే అని పయ్యావుల అనటం విచిత్రంగా ఉందన్నారు. పయ్యావుల చదువుకున్న వారని, ఙ్ఞానం ఉందని అనుకునే వాడిని.. ఇప్పుడు పయ్యావుల మాటలు విన్న తర్వాత లోకేష్ కంటే తక్కువ బుర్ర ఉందని తేలి పోయిందని ఎద్దేవా చేశారు. ఆర్ఈసీ నుంచి వచ్చిన లోన్ ను గుత్తేదారులకు డైరెక్ట్‌గా చెల్లించాం.. తప్పుడు ఆరోపణలు చేసినందుకు పయ్యావుల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అంబటి రాంబాబు.