Minister Ambati Rambabu: వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ స్థానాలకు ఒప్పుకోవడంపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు.. పవన్ కల్యాణ్ ఈసారైనా సీఎం అవుతారని కాపులు భావించారు.. కానీ, 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్లతో పవన్ సరిపెట్టుకున్నారు.. పవన్‌కు లెక్క ఉందా..? ఇదా తిక్క లెక్క..! అంటూ ఎద్దేవా చేశారు.. సీఎం సీఎం అని గొంతు చించుకున్న కాపులకు పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారన్న ఆయన.. టీడీపీతో పొత్తు పెట్టుకొని సీట్లు ప్రకటించుకున్నాడు.. 24 అసెంబ్లీ సీట్లు 3 పార్లమెంట్ స్థానాలకు పవన్ కక్కుర్తి పడ్డారని విమర్శించారు. ఇక, 175 టార్గెట్ తో వైసీపీ ఎన్నికలకు వెళ్తుందని ప్రకటించారు.
Read Also: MP Vijayasai Reddy: 3న మేదరమెట్లలో సిద్ధం సభ.. 15 లక్షల మందికి పైగా వస్తారు..!
చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడానికే ఓటు ట్రాన్ఫర్ చేయాలి అంటున్నాడు పవన్ కల్యాణ్.. కాపు సామాజిక వర్గానికి వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు మంత్రి అంబటి.. ఒకరి పల్లకి మోయడం కంటే.. విలీనం చేసి సినిమాలు తీసుకోవాలని సూచించారు. వంగవీటి రంగా హత్య తర్వాత కమ్మ, కాపుకి మధ్య ఉన్న ఆగాదాన్ని పూడ్చడానికే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు అని వ్యాఖ్యానించారు. ఇక, ముద్రగడను బతికుండగానే వేధించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. మరోవైపు.. అన్న చిరంజీవిని చూసి పవన్ కల్యాణ్ నేర్చుకోవాలి అని హితవుపలికారు. చిరంజీవి పార్టీని నడపలేని పరిస్థితిలో విలీనం చేసి సినిమాలు తీసుకుంటున్నాడు.. పవన్ కూడా పార్టీ విలీనం చేసి సినిమాలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాపు సోదరులు , పవన్ కల్యాణ్ ప్యాకేజీ రాజకీయాలకు బలి కావద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. ఇక, పొత్తుపై టీడీపీ-జనసేనకు క్లారిటీ లేదని.. చంద్రబాబు, పవన్ కన్ఫ్యూజన్‌తో ఉన్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఆశీస్సులున్నాయని పవన్ అన్నారు.. కానీ, బీజేపీ సింబల్ లేకుండానే పొత్తు ప్రకటన చేశారని దుయ్యబట్టారు.. ఇంకా మీడియా సమావేశంలో మంత్రి అంబటి ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
