NTV Telugu Site icon

Minister Amarnath: ఫోన్ రికార్డింగ్, ట్యాపింగ్ వేరు వేరు

Gudivada Amarnath

Gudivada Amarnath

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కోటం రెడ్డి వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. ఫోన్ రికార్డింగ్, ట్యాపింగ్ వేరు వేరు అన్నారు. థర్డ్ పార్టీ రికార్డింగ్ చేస్తే దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి…? పార్టీ మారాలని అనుకుంటే వెళ్ల వొచ్చు కానీ నిందలు వేయడం సరైన విధానం కాదని నా అభిప్రాయం.. విశాఖ పట్టణం రాష్ట్ర భవిష్యత్తుకు వేదిక కానుంది.. మార్చిలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్, G-20 సదస్సులు చాలా కీలకం అన్నారు. కొత్త బిల్లు పెట్టి విశాఖకు రాజధాని తీసుకుని వస్తాం అని స్పష్టం చేశారు. రాజధాని విశాఖ నుంచి పరిపాలన సాగిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత దానిపై కొత్త చర్చ అనవసరం అన్నారు. రాజధానికి కావాల్సిన మౌలిక వసతులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. పరిశ్రమలకు అవసర మైన వర్క్ ఫోర్., పారిశ్రామిక కారిడార్లలో సుమారు 50వేల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి.

Read Also: Union Budget 2023: పద్దును ప్రవేశపెట్టేందుకు పార్లమెంట్‌కు చేరిన నిర్మల.. పేపర్‌లెస్‌ ఫార్మాట్‌లోనే..

జగన్‌పై అభిమానంతో పార్టీలో ఎన్నో అవమానాలు భరించా. ఫోన్‌ ట్యాపింగ్‌పై నాకు స్పష్టమైన సాక్ష్యం దొరికిందన్నారు వివాదాస్పద వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు. అవమానాలు జరిగేచోట ఉండాల్సిన అవసరం లేదు. నాదగ్గరున్న ఆధారాలు బయటపెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సివస్తుంది. ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ మారాలని వుంటే మారవచ్చు.. కానీ.. ఇలాంటి ఆరోపణలు సరికాదన్నారు మంత్రి అమర్నాథ్.

Read Also: Kotam Reddy Sridhar Reddy: రాజకీయాలకు గుడ్ బై.. కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు