NTV Telugu Site icon

YSRCP Samajika Sadhikara Bus Yatra: 2019 లాగే.. 2024లో వైసీపీకి పట్టం కట్టాలి.. మళ్లీ సీఎంగా జగనే ఉండాలి..!

Adimulapu Suresh On Cbn

Adimulapu Suresh On Cbn

YSRCP Samajika Sadhikara Bus Yatra: 2019 లాగానే, 2024లోనూ వైసీపీకి పట్టం కట్టాలి.. మళ్లీ సీఎంగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డే ఉండాలని ఆకాక్షించారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.. పల్నాడులో నిర్వహించిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో అబద్ధపు హామీలు ఇచ్చి నట్టేట ముంచారని విమర్శించారు. పేదల గుండె తడి తెలిసిన సీఎం జగన్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నా రు.. గతంలో పేదలకు అందని ఇంగ్లీష్ విద్యా, అణగారిన వర్గాలకు ఇప్పుడు అందుతుందన్నారు.. గొప్ప పదవుల్లో పేదలు, అణగారిన వర్గాలు ఉంటున్నారు.. గతంలో సామాజిక సాధికార అంశం ఓటు బ్యాంకుగా ఉండేదన్నారు. అయితే, ఇప్పుడు ప్రతి పేదవాడికి మేలు జరిగిందా లేదా? ప్రజలు ఆలోచించాలని సూచించారు. సీఎం వైఎస్‌ జగన్‌ సమాజంలో సంపద సృష్టిస్తున్నారు.. స్థూల ఉత్పత్తిలో మెరుగైన స్థానాన్ని ఏపీ సాధించింది.. మళ్లీ వైసీపీకి పట్టం కట్టాలి.. జగనే సీఎంగా ఉండాలి అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్‌..

ఇక, మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు మోసానికి గురి అయ్యారు.. జగన్ పాలనలో అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు వస్తున్నాయన్నారు.. మళ్లీ పేదలను మోసం చేయడానికి చంద్రబాబు ఎత్తులు వేస్తున్నాడు అని మండిపడ్డారు. అంబేడ్కర్, జ్యోతి రావ్ పులే ఆశయాల సాధనకు కృషి చేస్తున్న సీఎం జగన్ కు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు మంత్రి పదవులు ఇచ్చిన నాయకుడు సీఎం జగన్.. లక్షా డెబ్బై ఆరువేల కోట్ల రూపాయలకు పైగా బడుగు వర్గాలకు ఇచ్చారని తెలిపారు. దుష్ట చతుష్టయం నుండి జగన్ ను కాపాడు కోవాలి.. జగన్ మరో సారి సీఎం కావాలి అని ఆకాక్షించారు మంత్రి మేరుగ నాగార్జున

రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక యాత్ర సాగుతుంది.. మూడు ప్రాంతాల ప్రజలు యాత్రను జయప్రదం చేశారని తెలిపారు ఎమ్మెల్సీ కుంభ రవి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ,సామాజిక వర్గాల ప్రజలు యాత్రలో పాల్గొంటున్నారు.. తర తరాలుగా అణిచివేతకు గురైన వర్గాలు, సీఎం జగన్ అండతో సాధికారత సాధిస్తున్నారని తెలిపారు. 75 ఏళ్ల చరిత్రలో నా ఎస్సీలు, నా బీసీలు అన్న ముఖ్య మంత్రి లేరు.. ఒక్క జగన్ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ చేస్తున్న పనులు, ప్రజలకు అవగాహన కలిగించాలి అనే ధ్యేయంతో సాధికార యాత్ర చేస్తున్నాం.. ప్రభుత్వ స్కూళ్లలో ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం విద్యా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. కాగా, పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠం రాజు పల్లి వద్ద నుండి సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభమైంది.. యాత్రలో ఎంపీలు విజయసాయిరెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు.. మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.