Site icon NTV Telugu

Adimulapu Suresh: పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం లక్ష్యం..

Minister Adimulapu Suresh

Minister Adimulapu Suresh

Adimulapu Suresh: పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం.. గుడివాడ టిడ్కో ప్లాట్లను సీఎం త్వరలో ప్రారంభిస్తారని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించిన ఆయన.. గుడివాడ మల్లాయిపాలెం లేఅవుట్ లో.. కలెక్టర్ రాజబాబు, అధికార యంత్రాంగంతో కలిసి టిడ్కో ఫ్లాట్లను పరిశీలించారు.. లేఅవుట్‌లో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టిడ్కో లేఅవుట్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ విపక్షాలకు సవాల్‌ విసిరారు.. టిడ్కో నిర్మాణాలపై తెలుగుదేశం పార్టీ నేతలు పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.. నామమాత్రంగా నిర్మించిన ఫ్లాట్లను టీటీడీపీ హయాంలో ప్రారంభించారు.. టీడీపీ నేతలు ప్రారంభించిన ఇళ్లలో ఒకరైన నివాసం ఉంటున్నారా? అని నిలదీశారు. 14 వేల కోట్ల అదనపు ఖర్చుతో లే అవుట్ల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

Read Also: Karnataka assembly elections Live Updates: కొనసాగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

ప్రజలు నేరుగా వచ్చినివాసముండేలా 50 వేల టిడ్కో ఫ్లాట్లను 100 శాతం నిర్మించామని వెల్లడించారు మంత్రి సురేష్‌.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో టిడ్కో లబ్ధిదారులకు 400 కోట్ల రాయితీలు ఇచ్చామని గుర్తుచేశారు.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇస్తున్న ఇళ్లకు.. పదేపదే తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్న ప్లాట్లకు ఎటువంటి పోలిక లేదన్నారు.. పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.

Exit mobile version