ఆసియాలో అతిపెద్ద ఆదివాసీల పండుగలలో ఒకటైన మెగా మేడారం జాతర యొక్క చిన్న జాతర నేడు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ద్వైవార్షిక జాతరను నిర్వహిస్తుండగా, ఆలయ పూజారులు ఈ మధ్య సంవత్సరంలో భక్తుల అభ్యర్థన మేరకు మినీ జాతర (మండ మెలిగే) నిర్వహిస్తారు. సమ్మక్క-సారలమ్మ మేడారం ఆలయ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపిన వివరాల ప్రకారం.. నేడు ఆలయ శుద్ధి, పూజలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 2న సమ్మక్క, సారలమ్మ దేవతలకు పసుపు, పచ్చిపూలతో పూజలు నిర్వహిస్తారు. మండ మెలిగే ఆచారం ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరగనుంది. గిరిజన జాతరకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
Also Read : Uttarakhand Cracks : జోషిమఠ్ తరహాలోనే మరో రెండు నగరాల్లో పగుళ్లు
అయితే.. గతంలో ఈ మినీ జాతరకు మేడారం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మాత్రమే వచ్చేవారు. ఇప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నారు. రెండేళ్లకు ఓసారి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర.. మధ్యలో మినీ జాతర పేరిట ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే.. ఇందులో భాగంగా నేడు మండమెలిగే పండుగతో మినీ జాతర బుధవారం ప్రారంభమైంది. గురు, శుక్ర వారాల్లో సారలమ్మ, సమ్మక్క గద్దెలను శుద్ధి చేసి భక్తులు తమ మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతిస్తారు. ఈ మినీ జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం జరగదని, గద్దెలపై ప్రత్యేక పూజలు మాత్రమే చేస్తామని పూజారులు చెప్పారు.
Also Read : Stock Markets Today: బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో జోష్.. భారీ లాభాల్లో సెన్సెక్స్
నేటి నుంచి మేడారం మినీ జాతర కొనసాగనుంది. ఇక మేడారం మినీ జాతర నేపథ్యంలో రెండు రోజుల నుండి భక్తులు మేడారానికి పోటెత్తారు. తలనీలాలు సమర్పించి, జంపన్న వాగుల పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవార్లకు బంగారాన్ని నివేదించి మొక్కలు చెల్లించుకుంటున్నారు. మేడారం చిన జాతరకు కూడా దాదాపు 5 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు ఏర్పాటు చేశారు. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో మేడారం మినీ జాతర కూడా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.