Site icon NTV Telugu

Millet Man : ‘మిల్లెట్ మ్యాన్’ పీవీ సతీశ్ ఇకలేరు

Pv Sathis

Pv Sathis

‘మిల్లెట్ మ్యాన్’గా తెలుగు ప్రజలకు చిరపరిచితమైన పీవీ సతీశ్ కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చిరు ధాన్యాలను సంరక్షించేందుకు, మహిళా రైతులను ప్రోత్సహించేందుకు పీవీ సతీశ్ 1983లో ప్రత్యేకంగా డీడీఎస్‌ను స్థాపించారు. జహీరాబాద్‌ ప్రాంతంలో మహిళా రైతులను ఏకం చేసి వారిచే చిరు ధాన్యాల పంటలను సాగు చేయించి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చారు పీవీ సతీశ్.

Also Read : Eliza and Kambala Jogulu: టీడీపీ ఎమ్మెల్యేలపై అట్రాసిటీ కేసు పెట్టాలి..!

ముఖ్యంగా ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రీయ విధానంలో పంటలను సాగు చేయించి.. సాగు చేసిన పంట ఉత్పత్తులను అక్కడే అదనపు విలువ జోడించి ప్యాకింగ్‌ చేసి పలు రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేశారు పీవీ సతీశ్. పాత కాలపు 75 గ్రామాల్లోని దాదాపు 5 వేల మందికిపైగా డీడీఎస్‌లో సభ్యులుగా ఉన్నారు. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషికి గాను 2019లో ఐరాస డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ఈక్వేటర్ ప్రైజ్, ప్రిన్స్ ఆల్బర్ట్- మొనాకో ఫౌండేషన్ అవార్డు వంటి అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు.

Also Read : Girlfriend Ride: బైక్‌పై ప్రియురాలు షికార్లు.. తట్టుకోలేక ప్రియుడు ఏం చేశాడంటే?

Exit mobile version