Aaron Finch: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆరోన్ ఫించ్.. జెర్సీ నెంబర్ 5కి రిటైర్మెంట్! ఇదే తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaron Finch announced his retirement from Cricket: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికాడు. 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఫించ్.. తాజాగా క్రికెట్ మొత్తానికి గుడ్ బై చెప్పాడు. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 2024లో భాగంగా శనివారం మెల్‌బోర్న్ రెనెగేడ్స్, మెల్‌బోర్న్ స్టార్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచే ఫించ్ కెరీర్‌లో చివరిది. బీబీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి 13 సీజన్లుగా మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఫించ్‌కు ఆ ప్రాంచైజీ ఘనమైన వీడ్కోలు ఇచ్చింది.
బీబీఎల్ మొత్తం 13 సీజన్‌లలో ఒకే ఫ్రాంచైజీకి ఆడిన ఏకైక ఆటగాడు ఆరోన్ ఫించ్ మాత్రమే. 11 సీజన్‌లలో సారథిగా వ్యవహరించిన ఫించ్.. రెండు సీజన్‌లలో ఆటగాడిగా కొనసాగాడు. ఏళ్ల పాటు జట్టుకు ఆడిన ఫించ్‌కు మెల్‌బోర్న్ రెనెగేడ్స్ యాజమాన్యం అరుదైన గౌరవం కల్పించింది. గార్డ్ ఆఫ్ హానర్‌గా ఫించ్ జెర్సీ నెంబర్ 5కి రిటైర్మెంట్ ప్రకటించింది. ఇకపై 5వ నెంబర్ జెర్సీని గ్యాలరీలో ఉంచనున్నారు. బిగ్‌బాష్ లీగ్ చరిత్రలోనే ఓ ఆటగాడి జెర్సీని మరెవరికీ కేటాయించకపోవడం ఇదే తొలిసారి.
Also Read
- Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
- UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
- Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
Also Read: IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన భారత్! కళ్లన్నీ కోహ్లీపైనే
ఆరోన్ ఫించ్ చివరి మ్యాచ్ సందర్భంగా డాక్‌ల్యాండ్స్ స్టేడియాన్ని తమ జెర్సీ రంగు (ఎరుపు రంగు)లోకి మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మార్చేసింది. చివరిసారిగా గ్రౌండ్‌లోకి ఎంట్రీ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. అయితే తన చివరి మ్యాచులో ఫించ్ డకౌట్ అయ్యాడు. మూడు బంతులు ఆడి ఒక్క పరుగు చేయకుండానే అతడు పెవిలియన్ చేరాడు. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టు మాత్రం విజయం సాధించింది. దీంతో సంతోషంగా ఫించ్ తన కెరీర్‌ను ముగించాడు. ఫించ్ సారథ్యంలో మెల్‌బోర్న్ ఒకసారి చాంపియన్‌గా అవతరించింది. బీబీఎల్ టోర్నీలో ఫించ్ 106 మ్యాచుల్లో 3,311 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
-
IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్‌కు లక్కీ ఛాన్స్!
-
UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
-
Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
-
Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?