Tiger: వికారాబాద్ జిల్లాలో పులుల సంచారం.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా పులి సంచరిస్తుంది. దామగుండం అటవీ ప్రాంతంలో రెండు వారాలుగా సంచరిస్తున్న చిరుత తాజాగా నిన్న (సోమవారం) రాత్రి చీలాపూర్‌లో ప్రత్యక్షమైనట్లు స్థానికులు వెల్లడించారు. చీలాపూర్ గ్రామానికి చెందిన వడ్డె ఆంజనేయులు మరో ఇద్దరితో కలిసి రాత్రి పొలం దగ్గర కట్టిన పశువులకు మేత వేసేందుకు వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. దారి మధ్యలో ఓ వ్యవసాయ క్షేత్రం నుంచి ఆ పులి పొలాల వైపుగా పరుగులు తీసినట్లు వారు తెలిపారు.. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. అయితే, చీలాపూర్ గ్రామం గుట్ట ప్రదేశంలో ఉండటంతో రాత్రి వేళ ఇళ్ల మధ్యకు పులి వచ్చేందుకు ఆస్కారం ఉందని ఎవరూ బయటకు రావొద్దని గ్రామ సర్పంచ్ రాములు హెచ్చరించారు. దీంతో అటవీ శాఖ అధికారులు సమాచారం అందించారు. ఇక, పులి పాదముద్రలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Read Also: Bigg Boss7 Telugu : రతికాను సపోర్ట్ చేస్తున్న శివాజీ.. మరోసారి రెచ్చిపోయిన అమర్..
Also Read
- Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
- IND Vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
అయితే, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో పులి సంచారంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అనంతగిరి, దామగుండం అటవీ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా నిఘా ఏర్పాటు చేశారు. ఇక, పూడూర్ మండలం దామగుండం అటవీ ప్రాంతంలో మగపులి, అనంతగిరిలో ఆడవిలో ఆడపులి సంచరిస్తుందని పాదముద్రల ఆధారంగా గుర్తించారు. అధికారులు హెచ్చరికలతో సరిపెట్టకుండా ఎలాంటి ప్రాణహాని జరగకముందే పులిని బంధించాలని ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా పూడుర్ మండలంలో కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల, గొరిల్లా గుట్ట, రహీం కోళ్లఫారం పరిసర ప్రాంతాలలో చిరుత సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అలాగే చెవేళ్ల మండలంలోని కౌంకుట్ల, అంతారం, తంగడపల్లి గ్రామాల్లో సైతం చిరుత పులి సంచరిస్తుందనే ప్రచారంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!