Bigg Boss7 Telugu : రతికాను సపోర్ట్ చేస్తున్న శివాజీ.. మరోసారి రెచ్చిపోయిన అమర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతుంది.. ఈ వారం నామినేషన్స్ వాడి వేడిగా సాగుతున్నాయి..గత వారం శివాజీ, రతిక, గౌతమ్, యావర్, భోలే నామినేట్ అయ్యారు. యావర్, భోలే డేంజర్ జోన్లోకి వచ్చారు. తక్కువ ఓట్లు తెచ్చుకున్న భోలే ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో శివాజీ రతికాకు హితబోధ చేస్తుంటాడు.. ఎప్పుడూ లేట్ గా మొదలు పెట్టే అమ్మడుకు ఈసారి బిగ్ బాస్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు.. ఇప్పుడు ఆలస్యం చేస్తే నేరుగా బిగ్ బాసే నామినేట్ చేస్తారని హెచ్చరించారు. దీంతో రతికా శోభాశెట్టి పేరు చెప్పింది. గత వారం ఆమెకు ఇచ్చిన కెప్టెన్సీని సరిగా వినియోగించలేదని అందుకు నామినేట్ చేశానంటూ రీజన్ చెప్పుకొచ్చింది. అదే రీజన్ తో ప్రియాంక జైన్ కూడా నామినేట్ చేసింది..
ఇక వీరిద్దరూ రెచ్చిపోయారు.. ముగ్గురి మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది.. వీరి మాటల్లోకి నాగ్ సార్ ను లాగారు. ప్రతి దానికి మీకు నాగ్ సారే కావాలిగా ఒకసారి సార్ ను హౌజ్ లోకి రమ్మందాం.. అప్పుడు తెలుస్తుంది అంటూ రతికా అన్న మాటలకు.. శోభా ఏమో నువ్వు పిలిస్తే నాగ్ సార్ వస్తాడు కావొచ్చు.. మేం పిలిస్తే రాడు అనడం ఇంట్రెస్టింగ్ గా మారింది.. ఇక అర్జున్ పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేశారు. ప్రశాంత్ కొన్ని సందర్భాల్లో ప్రవర్తించే తీరు బాగోలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య కాస్తా వాగ్వాదం జరిగింది. శివాజీకి మద్దుతుగా మాట్లాడటం సరికాదంటూ అర్జున్ వాదించారు. నాకు అనిపించింది చేశానంటూ పల్లవి ప్రశాంత్ బదులిస్తూ వచ్చారు..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
అలాగే ప్రియాంక కూడా రతికాను నామినేట్ చేశారు.. రతికా ప్రియాంకపై మాటలతో రెచ్చిపోయింది. శివాజీ జోక్యంతోనూ గొడవ ఆగలేదు.. ఇక రతికాపై బాటిల్ పగిలింది. ఆ తర్వాత అశ్వినిని నామినేట్ చేసింది. లాస్ట్ వీక్ మొత్తం రూడ్ గా వ్యవహరించిందని కారణం చెప్పుకొచ్చింది. లాస్ట్ లో ప్రియాంక రతిక తలపై బాటిల్ ను పగలగొట్టడం చాలా నొప్పిగా ఫీల్ అయ్యింది.. ఇక అమర్ కూడా ప్రతి వారం లాగే ఈ వారం కూడా నామినేషన్స్ లో రెచ్చిపోయాడు.. మరి ఈ రోజు నామినేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?