PM Modi: మిడిల్ ఈస్ట్ యుద్ధంతో ప్రపంచ మార్కెట్ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. ప్రధానంగా ఇంధనం, గ్యాస్ సరఫరాలపై అనిశ్చితి నెలకొంది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఇంధన కొరత ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. భారత్‌లోనూ దీని ఎఫెక్ట్ ఉంది. అయితే.. ప్రస్తుతం భారత్ ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం దేశంలో ఎల్‌పీజీ కొరత లేదని కేంద్రం చెబుతోంది. కొరత లేనప్పటికీ.. భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగినట్లు సమాచారం. కొంతమంది వ్యాపారులు నిల్వ చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. దీంతో సామాన్యూలు ఆందోళన చెందుతున్నారు. ఈ భయాలనకు ప్రధాని మోడీ చెక్ పెట్టేశారు.
READ MORE: Cinema : రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసింది
ఈ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోడీ కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలో LPG, CNG, PNG, పెట్రోల్, డీజిల్ సరఫరాలపై ఎలాంటి ప్రభావం పడకూడదని సంబంధిత మంత్రిత్వ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని తెలిపారు. ఇదే విషయంపై ముందుగా కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సైతం స్పందించారు. భారత్ వద్ద Liquefied Natural Gas (LNG) నిల్వలు బాగానే ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని చెప్పారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మార్గంతో పాటు ఇతర మార్గాల ద్వారా గ్యాస్ సరఫరా కొనసాగించే అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
READ MORE: AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్ చేసిన నగల విడుదలకు బ్రేక్..
యుద్ధ పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగినా దేశానికి ఇంధన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యంగా Essential Commodities Act 1955 కింద కొత్త మార్గదర్శకాలు జారీ చేయడం, గ్యాస్ ఉత్పత్తిని పెంచడం, LPG బుకింగ్ నియమాలను మార్చడం వంటి నిర్ణయాలు ఉన్నాయి. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ తాజాగా “Natural Gas Supply Regulation Order 2026” ను ప్రకటించింది. ఈ ఆదేశం ప్రకారం ముందుగా గృహ వినియోగ ఎల్‌పీజీకే సరఫరాకే ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే మొదటగా ఇంటి అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తారు. ఆ తరువాత కమర్షియల్ గ్యాస్ సరఫరా జరుగుతుంది. ఈ నిర్ణయం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటి హాస్పిటాలిటీ రంగంలో కొంత ఆందోళన కనిపిస్తోంది.
