NTV Telugu Site icon

Israel- Hamas War: ఆహారం కోసం క్యూలో నిలబడిన పాలస్తీనియన్లపై విధ్వంసం.. 20 మంది మృతి

Israel Hamas War

Israel Hamas War

ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం ఇప్పట్లో ఆగిపోయేలా కనిపించడం లేదు.. రోజు రోజుకు గాజాలో మరణాల సంఖ్య పెరుగుతోంది. అనేక మంది పిల్లలతో సహా పౌరులు కాల్పులు, బాంబు దాడులకు బాధితులుగా మారుతున్నారు. అయితే, ఆహారం, నిత్యవసరాల వస్తువుల సహాయంగా గాజాకు పంపిణీ చేయబడుతున్నాయి. ఇంతలో, ఆహారం కోసం ఎదురుచూస్తున్న చాలా మంది పాలస్తీయన్లపై ఇజ్రాయెల్ సైనికుల కాల్పుల్లో మరణించారు. ఈ దాడిలో దాదాపు 20 మంది మరణించడంతో పాటు 150 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజాలోని కువైట్ క్రాస్‌రోడ్స్ దగ్గర ఈ దాడి జరిగింది అని పేర్కొన్నారు.

Read Also: Rahul Gandhi: మేం అధికారంలోకి వస్తే రైతుల గొంతుక అవుతాం..

ఇక, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అల్ షిఫా ఆసుపత్రి అత్యవసర విభాగంలో వైద్యుడు మహ్మద్ గరాబ్ తెలిపారు. రోడ్డు, వాయు, సముద్రం మార్గాల ద్వారా గాజాకు ప్రపంచ దేశాల నుంచి మానవతా సహాయం అందుతోంది. ఇక, తొలిసారిగా గాజాకు సముద్ర మార్గం ద్వారా మానవతా సాయం అందింది. UAE నిధులతో కూడిన ఓడ మంగళవారం బయలుదేరింది.. WCKitchen నుంచి ఈ సహాయం గాజాకు అందింది. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్‌ సైన్యాలు ఒక్కసారిగా అక్కడి ప్రజలపై దాడి చేయడంతో ఈ దారుణం చోటు చేసుకుంది.