Michael Jackson Biopic: ఇండియాలో ‘మైఖేల్’ మేనియా.. లక్ష దాటిన టికెట్ల అమ్మకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మైఖేల్’. ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అత్యధిక క్రేజ్ ఉన్న చిత్రంగా ఇది నిలిచింది. డబ్బింగ్ వెర్షన్లు లేకుండా కేవలం ఇంగ్లీష్‌లోనే విడుదలవుతున్నా, భారతీయ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎగబడుతుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
Also Read : Ninnu Kori: నాని ‘నిన్ను కోరి’ రొమాంటిక్ ట్రీట్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్
Also Read
- Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- Nepal Floods: "నువ్వు దేవుడు సామీ".. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
సమాచారం ప్రకారం, ఇండియాలో కేవలం మల్టీప్లెక్సుల్లోనే ఇప్పటివరకు లక్షకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో రేపు రాత్రి పడబోయే ప్రీమియర్ షోలు దాదాపు హౌస్ ఫుల్ అయ్యాయి. జెన్-జీ కిడ్స్ (Gen-Z) సైతం ఈ ఐకాన్ జీవితాన్ని స్క్రీన్ మీద చూడటానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. అయితే ఒరిజినల్ ఫీల్ మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే మేకర్స్ దీనిని ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయలేదు.
ఇక మైఖేల్ జాక్సన్ ప్రభావం భారతీయ సినిమాపై ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి ‘దొంగ’ సినిమాలోని ‘గోలీమార్’ సాంగ్, ప్రభుదేవా ‘ముక్కాలా ముక్కాబులా’ వంటి ఐకానిక్ స్టెప్పులకు మైఖేల్ జాక్సనే స్ఫూర్తి. ఒక స్టీల్ ఫ్యాక్టరీ వర్కర్ కుమారుడిగా పుట్టి, ప్రపంచాన్నే తన డ్యాన్స్‌తో ఉర్రూతలూగించిన ఆయన జీవితంలోని వెలుగు చీకట్లను 2 గంటల 7 నిమిషాల నిడివితో ఈ సినిమాలో ఆవిష్కరించారు. కాగా ఈ మైఖేల్ పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ పరకాయ ప్రవేశం చేశాడని తెలుస్తోంది. కొన్ని చోట్ల మిశ్రమ స్పందన వినిపిస్తున్నా, సినిమాలోని మ్యూజిక్, డ్యాన్స్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయట. ఇండియాలో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వారం రోజులు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జాతర ఖాయం.
తాజావార్తలు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!