MI vs CSK: వాంఖెడేలో తిలక్ వర్మ – జేమీ ఓవర్టన్ మధ్య మాటల యుద్ధం.. వీడియో వైరల్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MI vs CSK: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడూ హై వోల్టేజ్ డ్రామా, టెన్షన్, ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇదే మళ్లీ ఐపీఎల్ 2026 సీజన్లోను కనిపించింది. ముంబై లోని వాంఖెడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ, జేమీ ఓవర్టన్ మధ్య జరిగిన మాటల యుద్ధం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముంబై బ్యాటింగ్ సమయంలో 10వ ఓవర్ వేయడానికి వచ్చిన CSK ఫాస్ట్ బౌలర్ జేమీ ఓవర్టన్, తన ఓవర్ చివరి బంతిని స్లో ఆఫ్కట్టర్గా వేయగా, తిలక్ వర్మ దాన్ని డీప్ మిడ్‌వికెట్ వైపు ఆడాడు. ఒక రన్ తీసుకున్న తర్వాత రెండో రన్ కోసం ప్రయత్నించగా, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ అతన్ని వెనక్కి పంపాడు. ఈ సమయంలో ఓవర్టన్ బౌలింగ్‌కు రాగా ఫీల్డర్లు కదులుతున్నారని తిలక్ వర్మ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
“ఫీల్డర్ కదులుతున్నాడు, మీరు బౌల్ చేయబోతున్నప్పుడు అతను హాఫ్‌వేలో ఉన్నాడు” అంటూ గట్టిగా మాట్లాడాడు. దీనికి ఓవర్టన్ కూడా సమాధానం ఇవ్వడంతో మైదానంలో కాస్త మాటల యుద్ధం పెరిగింది. టీవీ రిప్లేల్లో కూడా ఫీల్డర్ కదులుతున్నట్టు కనిపించడంతో తిలక్ అభ్యంతరం కొంతవరకు సమర్థించబడింది. ఈ ఘటన తర్వాత అకీల్ హోసైన్ స్పిన్ కు తిలక్ వర్మ అవుట్ అయ్యాడు. 29 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు ఓవర్టన్, ముంబై టెయిలెండర్ కృష్ణ్ భగత్ వికెట్ తీసుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 207/6 భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ కేవలం 54 బంతుల్లో 101* పరుగులు చేసి ఈ సీజన్ లో రెండో సెంచరీ నమోదు చేశాడు. చేజింగ్‌లో ముంబై ఇండియన్స్ పూర్తిగా విఫలమైంది. 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ముంబై జట్టు 104 పరుగులకే ఆలౌట్ అయింది. సూర్యకుమార్ యాదవ్ (35), తిలక్ వర్మ (37) తప్ప మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అకీల్ హోసైన్ 4/17తో మ్యాచ్ ను పూర్తిగా చెన్నై వైపు తిప్పేసాడు.
ఈ మ్యాచ్‌లో మరో వివాదం కూడా చర్చనీయాంశమైంది. మిచెల్ సాంట్నర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవడం పట్ల అభిమానులు విమర్శలు గుప్పించారు. “ఇది చీటింగ్” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి.
Heat. Pressure. Drama 😤
This rivalry never disappoints 🔥#TATAIPL 2026 | #MIvCSK | LIVE NOW 👉 https://t.co/vkBKeocOG2 pic.twitter.com/hETDJPFFK3
— Star Sports (@StarSportsIndia) April 23, 2026
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?