MI Captain Change: ‘ముంబై ఇండియన్స్’ కెప్టెన్సీ నుండి ‘హార్దిక్ పాండ్య’ అవుట్..? కొత్త కెప్టెన్ గా..!
- ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై మళ్లీ చర్చ
- హార్దిక్ పాండ్య కెప్టెన్ పదవి అవసరమా..?
- కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు వైరల్
- సూర్యకుమార్ యాదవ్ కొత్త కెప్టెన్‌గా సరైన ఎంపిక అని అభిప్రాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MI Captain Change: మరో 5 రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ మొదలు కానుంది. అయితే ఇంతలో ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్సీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్య తన నాయకత్వ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించాలంటూ ఆయన సూచించారు. ముంబై ఇండియన్స్ (MI) చివరిసారిగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2020లో టైటిల్ గెలిచింది. అంటే ముంబై ట్రోఫి గెలిచి ఐదేళ్లు అవుతుంది.
Also Read
2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ ద్వారా హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఆ సీజన్ లో జట్టు పాయింట్ల పట్టికలో చివరిస్థానలలో నిలవడం పలు విమర్శలకు దారితీసింది. ఇక ఐపీఎల్ 2025 సీజ న్‌లో ప్లే ఆఫ్స్ కు చేరినా, ట్రోఫీ దక్కకపోవడంతో కెప్టెన్సీపై మళ్లీ రచ్చ మొదలైంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి వరల్డ్‌కప్ విజేత కెప్టెన్లు జట్టులో ఉండగా హార్దిక్ పాండ్య నాయకత్వంపై ఇప్పుడు అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం, జట్టు మేనేజ్మెంట్, అలాగే హార్దిక్, రోహిత్, సూర్యకుమార్ కలిసి భవిష్యత్‌పై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కృష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్ లో సూచించారు. ఈ పరిస్థితిని “వింత పరిస్థితి”గా ఆయన పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 టీమ్ ఇండియాకు విజయం అందించిన ‘సూర్యకుమార్ యాదవ్’ కెప్టెన్సీకి సరైన ఎంపిక అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాదు హార్దిక్ పాండ్యానే స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుని, సూర్యకుమార్ కు బాధ్యతలు అప్పగిస్తే సమస్య సులభంగా పరిష్కారం అవుతుందని శ్రీకాంత్ సూచించడం కొసమెరుపు. “సూర్యకుమార్ లీడ్ చేయాలి, నేను సపోర్ట్ చేస్తాను” అని హార్దిక్ చెబితే జట్టులో ఉన్న అంతర్గత సమస్యలు పూర్తిగా సర్దుకుంటాయని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!