Site icon NTV Telugu

AP Metro Rail Projects: విజయవాడ, వైజాగ్ మెట్రో రైల్‌కు రంగం సిద్ధం.. రేపే టెండర్లు..!

Metro Rail

Metro Rail

AP Metro Rail Projects: విజయవాడ, వైజాగ్ మెట్రో రైల్‌కు రంగం సిద్ధం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం రేపు టెండర్లు పిలవనుంది. రూ. 21,616 కోట్లతో వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నారు. విజయవాడ మెట్రో రైలుకు 10,118 కోట్లు, వైజాగ్ మెట్రోకు రూ. 11,498 కోట్ల టెండర్లు కేటాయించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% శాతం నిధుల భాగస్వామ్యంతో విజయవాడ, వైజాగ్ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రారంభం కానుంది. వైజాగ్ మెట్రో రైలుకు వీఎంఆర్డీఏ నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటా గా రూ. 4,101 కోట్లు నిధులు మల్లించనున్నారు. విజయవాడ మెట్రోకు సీఆర్డీఏ నుంచి రూ. 3,497 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా నిధులు ఏర్పాటు చేయనున్నారు.

READ MORE: AP Govt: గుడ్‌న్యూస్.. “తల్లికి వందనం” నగదు జమపై ప్రభుత్వం క్లారిటీ..

Exit mobile version