దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే రెండోమూడు రోజుల్లో ఒడిశాలోని పశ్చిమ-వాయవ్య దిశగా కదలనుంది. ఈ నెల 24న వాయవ్యం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మధ్య భారతదేశంలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురవనుండగా, పశ్చిమ భారతదేశంలోని గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.
Read Also: Extramarital Affair: పరాయి వ్యక్తితో భార్య ఎఫైర్.. అడ్డుగా ఉన్నాడని భర్త హత్య
ఇక, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ పేర్కొనింది. ఈ నెల 26 వరకు కొన్ని ప్రాంతాలో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు పడే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: Krithi Shetty : తడిచిన అందాలతో సెగలు పుట్టిస్తున్న కృతి..
ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నందున మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించింది. కోస్తాంధ్ర – ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వివరించారు.