NTV Telugu Site icon

Twitter : ట్విటర్ తీసేసింది.. ఇప్పుడు మెటా మొదలు పెట్టింది

Mewtatt

Mewtatt

Twitter : ట్విటర్ బాటలోనే ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా కూడా ఉద్యోగుల తొలగించేందుకు సిద్ధమైనట్లు వాల్ స్ట్రీట్ జర్నర్ ఓ నివేదికను వెల్లడించింది. ఈ వారంలోనే ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించేందుకు మార్క్ జుకర్ బర్గ్ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మెటా ప్లాట్ ఫాం బుధవారం కల్లా ఉద్యోగుల తొలగింపును ప్రకటిస్తుందని అంటున్నారు. కరోనా తర్వాత పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నప్పటికీ ఉద్యోగాల కోతలు పెరుగుతుండడంపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Iron leg Pooja: బుట్టబొమ్మకు బ్యాడ్ టైమ్.. వరుస ఫ్లాపులతో వెకేషన్ మూడ్‎లోకి పూజాహెగ్దే

మార్క్ జుకర్‌బర్గ్ కు చెందిన మెటావర్స్ ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించాలని సంస్థ యోచిస్తోంది. ఓ వైపు ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం, టిక్‌టాక్ నుంచి పోటీ, ఆపిల్ సంస్థ నుంచి గోప్యతా మార్పులు, మెటావర్స్‌పై భారీ వ్యయం ఆందోళనలతో సంస్థపై నిరాశాజనకమైన దృక్పథం ఏర్పడింది. అధిక వడ్డీ రేట్లు, పెరిగిన ద్రవ్యోల్బణం, ఐరోపాలో ఇంధన సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించింది. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, ట్విట్టర్, స్నాప్ లతో సహా పలు సాంకేతిక కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. దీంతో పాటు కొత్తగా ఉద్యోగుల నియామకాలను కూడా తగ్గించాయి. సెప్టెంబరు చివరి నాటికి 87 వేల మందికిపైగా ఉద్యోగులు ఉన్నట్టు మెటా సంస్థ పేర్కొంది.

Balakrishna: ఆ సినిమా సీక్వెల్ కోసం కలం పట్టిన బాలయ్య

ఫేస్‌బుక్ చరిత్రలో ఈ స్థాయిలో ఉద్యోగుల కోత విధించడం ఇదే తొలిసారి. ఇటీవల ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ సంస్థలోని ఉద్యోగులను సగానికి సగం తగ్గిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే పలు విభాగాల హెడ్‌లపై వేటు వేయగా, పలువురు ఉద్యోగులను కూడా తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో ఫేస్‌బుక్ నడుస్తుండడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

Show comments