Viral Video: బెంజ్ లో వస్తే మాత్రం డబ్బులు నేలకేసి కొట్టాలా? మహిళ కన్నీరు.. నెటిజన్ల ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: డబ్బు కొన్నిసార్లు మనిషిలో ఎక్కడలేని అహంకారం పెంచుతుంది.. బిలియనీర్లు అయినా.. కొందరు సాటి మనిషిని మనిషిగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు.. కొందరు మాత్రం డబ్బు మదంతో విర్రవీగుతారు.. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియో ప్రకారం.. మెర్సిడెజ్ బెంజ్‌కారులో వచ్చిన ఓ వ్యక్తి పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు.. తన కారులో ఇంధనం పోయించుకున్నాడు.. ఆ తర్వాత బంక్‌లో ఉన్న సదరు మహిళా.. కారు ఓనర్ దగ్గరకు వెళ్లి డబ్బులు అడిగింది.. దీంతో.. ఆమె చేతికి డబ్బు ఇవ్వకుండా నేలకేసి విసిరికొట్టాడు. కానీ, ఆ మహిళ మాత్రం సహనం కోల్పోకుండా.. నిదానంగా.. ఆ కరెన్సీ నోట్లను ఒక్కొక్కటిగా ఏరి తన బ్యాగ్‌లో వేసుకుంది.. అప్పడికే కారు ముందుకు కదిలిపోగా.. ఆ మహిళ మాత్రం బాధను కళ్లు తుడుచుకున్నట్టుగా కనిపిస్తోంది..
Read Also: Telegram New Features: టెలిగ్రాంలో సరి కొత్త ఫీచర్స్.. ఇక, వాట్సాప్‌కు చెక్..!
Also Read
- Chandra Kumar Bose: "చరిత్రను వక్రీకరించడం నేరం".. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
- AP Mayor Elections 2026: 13 కార్పొరేషన్లలో 346 నామినేషన్ల ఉపసంహరణ.. చిత్తూరులోనే అత్యధికం!
- Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
- God of War: ఎన్టీఆర్ - త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్'.. తొలిసారి నోరు విప్పిన మాటల మాంత్రికుడు.!
మొత్తంగా చైనాలోని గ్యాస్ స్టేషన్ ఉద్యోగి పట్ల కారు యజమాని అమర్యాదగా ప్రవర్తించిన తీరు ఇంటర్నెట్లో దుమారం రేపింది. రెడ్డిట్‌లో పంచుకున్న వీడియోలో ఒక లగ్జరీ కారు యజమాని గ్యాస్ స్టేషన్లో ఇంధనం నింపిన తర్వాత కారు డోర్ నుంచి డబ్బు విసిరి, సిబ్బందికి కన్నీళ్లు పెట్టించాడు.. ”గ్యాస్ స్టేషన్ వర్కర్ కోసం డబ్బును నేలపై విసిరేయడం” అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేయడంతో.. వైరల్‌గా మారిపోయింది.. 50 సెకన్ల ఆ క్లిప్‌లో బ్లాక్ మెర్సిడెస్ కారు ఇంధనం నింపుకోవడానికి గ్యాస్ స్టేషన్లోకి ప్రవేశించడాన్ని చూడవచ్చు. మహిళా అటెండర్ కారులో పెట్రోలు నింపడం గమనించవచ్చు, ఆ తర్వాత ఆమె యజమానిని డబ్బులు అడగడం.. ఆమెకు డబ్బును గౌరవంగా ఇవ్వడానికి బదులుగా, యజమాని కొన్ని నోట్లను నేలమీద విసిరేయడం.. కారు స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత ఆమె నోట్లను తీసుకున్నప్పటికీ, ఆమె అవమానంగా భావించి కన్నీళ్లు పెట్టుకోవడం.. ఇప్పుడు నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది..
Read Also: Pathaan: కేవలం ఓవర్సీస్ లోనే 320 కోట్లు… ఇది కదా ర్యాంపేజ్ అంటే…
ఆ క్లిప్‌ను చూసిన ఇంటర్నెట్ వినియోగదారులు ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కారు యజమాని, అతని అసభ్య ప్రవర్తనపై విమర్శలు గుప్పించారు. అన్ని గ్యాస్ స్టేషన్లలో కారు ప్రవేశాన్ని నిషేధించాలని కొందరు అధికారులను కోరారు. ఒక వినియోగదారు ఈ సంఘటనపై స్పందిస్తూ, ” ఇది చాలా నిరుత్సాహకరం. ఆమె కన్నీళ్లు తుడుచుకోవడం చూసి.. ప్రజలు ఎవరితోనైనా ఇలా ప్రవర్తిస్తూ ఎలా జీవిస్తారు?’’ అని మరొకరు వ్యాఖ్యానించారు, ‘‘తమ కంటే తక్కువ అదృష్టవంతుల పట్ల వారు ఎలా ప్రవర్తిస్తారో చూస్తే వారి నిజ స్వభావాన్ని ఇది తెలియజేస్తుంది. మరోవ్యక్తి.. ”ఎందుకు? ప్రజలు నీచంగా ఎందుకు ఉండాలి? కారణం లేదు! ఇది మంచిగా ఉండటానికి ఏమీ ఖర్చు కాదుకదా? అని రాసుకురాగా.. ”కర్మ ఇలాంటి వ్యక్తులను పట్టిస్తుందని నేను నమ్ముతున్నాను.. ఈ మహిళ ఏమి చేస్తుందో ఎవరికి తెలుసు. నేను ఆమెను కౌగిలించుకోవాలనుకుంటున్నాను, ఇది బాధిస్తుందనగా.. మరో వ్యక్తి.. ‘కర్మ ఇలాంటి వ్యక్తులను పట్టిస్తుందని నేను నమ్ముతున్నాను.. ఈ మహిళ ఏమి చేస్తుందో ఎవరికి తెలుసు. నేను ఆమెను కౌగిలించుకోవాలనుకుంటున్నాను, ఈ ఘటన బాధిస్తోంది అని.. ఇలా అనేక రకాలుగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు..
Throwing money on the ground for gas station worker.
byu/mindyour inMadeMeCry
తాజావార్తలు
-
Chandra Kumar Bose: “చరిత్రను వక్రీకరించడం నేరం”.. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
-
AP Mayor Elections 2026: 13 కార్పొరేషన్లలో 346 నామినేషన్ల ఉపసంహరణ.. చిత్తూరులోనే అత్యధికం!
-
Hyundai Bayon SUV: Hyundai Bayon లాంచ్.. ధర రూ.9.99 లక్షలు, 1.5L ఇంజిన్‌తో కొత్త SUV!
-
Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
-
God of War: ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’.. తొలిసారి నోరు విప్పిన మాటల మాంత్రికుడు.!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!