NTV Telugu Site icon

Mercedes-Maybach EQS 680: ఒక్క ఛార్జింగ్‌తో 600 కి.మీ ప్రయాణం.. అదిరిపోయిన ఫీచర్లు

Mercedes Maybach Eqs Suv

Mercedes Maybach Eqs Suv

Mercedes-Benz ఇండియా మేబ్యాక్ EQS ఆల్-ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసింది. దీని ధర.. రూ. 2.25 కోట్లు ఉంది. EQS 680 అనేది నెట్-ఎలక్ట్రిక్ లగ్జరీ SUV. ఇది గత ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చింది. అయితే.. మంచి లగ్జరీ కారు కోసం చూస్తున్న కస్టమర్లకు ఈ కారు గొప్ప ఎంపిక. ఎందుకంటే ఈ కారు అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా.. డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంది. ఇంతకీ.. కారు వివరాలేంటో తెలుసుకుందాం.

UP: పోలీసుల ఎన్‌కౌంటర్‌.. గ్యాంగ్‌స్టర్ హతం

అధునాతన ఫీచర్లు:
ఈ కారు డిజైన్, స్టైలింగ్ గురించి చెప్పాలంటే.. పెద్ద గ్రిల్, LED హెడ్‌లైట్లు.. టెయిల్‌లైట్లు కనిపిస్తాయి. అంతే కాకుండా.. ఈ కారులో అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. గ్లోబల్-స్పెక్ వాహనం వలే.. ఇది లగ్జరీ, సౌకర్యవంతమైన లక్షణాలను కలిగి ఉంది. ఈ కారులో..15-స్పీకర్ బర్మెస్టర్ 4D సరౌండ్ సౌండ్ సిస్టమ్, యాక్టివ్ యాంబియంట్ లైటింగ్, నప్పా లెదర్ సీట్లు, వెనుక ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్, పవర్డ్ కర్టెన్ వంటి అనేక అధునాతన సాంకేతిక లక్షణాలను కలిగి ఉంది. వెనుక కూర్చుని ప్రయాణిస్తున్న వారికి వినోదం కోసం స్క్రీన్ ఉంటుంది. దీనితో పాటు.. షాంపైన్ ఫ్లూట్ గ్లాస్‌తో కూడిన రిఫ్రిజిరేటర్ ను కూడా ఈ కారులో ఉన్నాయి.

భద్రతా ఫీచర్లు:
భద్రతా లక్షణాల గురించి మాట్లాడితే.. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ SUV 360-డిగ్రీ కెమెరా, మల్టీపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS, ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్ కలిగి ఉంది. ఇది ఎకో, స్పోర్ట్, ఆఫ్‌రోడ్, ఇండివిజువల్.. మేబ్యాక్ మోడ్ వంటి వివిధ డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది.

ఇంజిన్ పవర్ ట్రైన్:
Mercedes-Benz ఇండియా తొలిసారిగా మేబ్యాక్ EQS ఆల్-ఎలక్ట్రిక్ SUVని షాంఘై ఆటో షోలో ఆవిష్కరించారు. ఈ కారు.. EQS 680 107.8kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్‌లతో కనెక్ట్ చేశారు. ఈ కారు బ్యాటరీ-ఎలక్ట్రిక్ మోటార్ 649bhp శక్తిని, 950Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పరిధి-వేగం
ఈ ఎలక్ట్రిక్ SUV కేవలం 4 సెకన్లలో 0-100kmph నుండి స్పీడ్ ను అందుకోగలదు. పరిధి గురించి మాట్లాడితే.. ఈ EV ఒక ఛార్జ్‌పై 600km WLTP పరిధిని క్లెయిమ్ చేస్తుంది.

Show comments