NTV Telugu Site icon

YS Jagan: చంద్రబాబుకు ఓటేస్తే.. పేదలకు అందే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి..

Cm Jagan

Cm Jagan

Memantha Siddham: మేమంత సిద్ధం సభ జనసముద్రంగా మారిందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సిద్ధం సిద్ధం అంటూ ప్రజల నినాదాలు వైసీసీ జైత్రయాత్రకు శంఖారావంలా వినిపిస్తున్నాయి.. ప్రజలు చేస్తున్న సిద్ధం సిద్ధం అనే నినాదం ప్రతిపక్షాలకు యుద్ధం యుద్ధం అన్నట్లు ఉంది.. ప్రజల అభివృద్ధిని చీకటిలోకి తీసుకు వెళ్లాలని ఆలోచనతో జిత్తుల మారి పొత్తులు.. ఎదుర్కోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలి.. మే 13న జరిగే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎన్నుకునే ఎన్నికలు కాదు.. మన తల రాతలను మనమే నిర్ణయించుకునే ఎన్నికలు అని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు జరిగే ఎన్నికలు కాదు.. పేద ప్రజలకు చంద్రబాబుకు జరిగే ఎన్నికలు.. పేద ప్రజల పక్షాన జగన్ గా నేను పోటీ చేస్తున్నాను అని సీఎం జగన్ అన్నారు.

Read Also: Glass Bridge: విల్లు, బాణం ఆకారంలో ‘గ్లాస్ బ్రిడ్జ్’.. ఎక్కడ ఉందో తెలుసా..!

ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే, పేద ప్రజలకు అందే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని వైఎస్ జగన్ వెల్లడించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు గంగ క్యారెక్టర్ లో ఉంటారు.. ఎన్నికల తర్వాత లక లక అంటూ పేదలపై విరిచుకు పడతారు అని పేర్కొన్నారు. నారా చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారా?.. బాబు హయాంలో ఒకరికైనా మంచి జరిగిందా?. జాబు రావాలంటే ఎవరు కావాలి? అన్నారు.. ఏం జరిగిందో అందరు చూశారు.. కానీ, జాబు రావాలంటే ఫ్యాన్ రావాలా.. లేక తుప్పు పట్టిన సైకిల్‌ రావాలా? అని ఆయన ప్రశ్నించారు. మేం అధికారంలోకి రాగానే 2 లక్షల 31 ఉద్యోగాలను భర్తీ చేశాం.. పేదలకు వైద్య సేవలను ఇంటి వద్దకు తీసుకెళ్లాం.. గతంలో రైతులకు ఏమీ చేయని చంద్రబాబు.. ఇప్పుడు మేలు చేస్తాడని గొప్పలు చెబుతున్నాడు.. చంద్రబాబుది బోగస్‌ రిపోర్ట్‌.. జగన్‌ది ప్రొగ్రెస్‌ రిపోర్ట్‌ అని తెలిపారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని సీఎం జగన్‌ ధ్వజమెత్తారు.