Site icon NTV Telugu

Memantha Siddham: 20వ రోజుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే..

Jagan

Jagan

Memantha Siddham Bus Yatra: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 20వ రోజుకు చేరుకుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ శనివారం రాత్రి బస చేసిన చిన్నయపాలెం ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరనున్నారు. రాత్రి బస క్యాంప్‌ నుంచి బయలుదేరి పినగాడి, లక్ష్మీపురం మీదుగా వేపగుంటకు బస్సు యాత్ర చేరుకోనుంది. భోజనం విరామం తర్వాత విశాఖ సిటీలో సాగనున్న సీఎం పర్యటన కొనసాగనుంది. ఎన్‌ఏడీ, కంచర పాలెం, రైల్వే న్యూ కాలనీ, గురుద్వారా , వేంకోజీ పాలెం మీదుగా బస్సు యాత్ర సాగనుంది. హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్‌ చేరుకుంటారు.

Read Also: Pawan Kalyan: మీకు కత్తి ఇస్తాను.. తప్ప చేస్తే నా తల నరకండి

బస్సు యాత్రలు, రోడ్‌షోలు, ముఖాముఖిలు నిర్వహిస్తూనే.. బస్సు యాత్రలో భాగంగా వైసీపీ భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తోన్న విషయం విదితమే.. సీఎం జగన్‌పై రాయి దాడి తర్వాత పోలీసులు మరింత భద్రత కల్పిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డులో సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. కాగా, ఎన్నికల ప్రచారంలో ఇడుపులపాయలో మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించిన సీఎం జగన్‌.. ఇచ్చాపురం వరకు చేరుకోనున్న విషయం విదితమే.

https://twitter.com/YSRCParty/status/1781872815274361221

 

Exit mobile version