Mekathoti Sucharitha: అది రాజీనామా కాదు.. థ్యాంక్స్ గివింగ్ నోట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కేబినెట్ ప్రక్షాళన అనంతరం కొన్నిచోట్ల అసంతృప్తులు బయటపడ్డాయి. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత అసహనంతో వున్నారని, ఆమె రాజీనామా చేశారనే వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ సీఎం జగన్ తో భేటీ అయ్యారు సుచరిత. పార్టీ, సీఎం జగన్ ఎంతో గౌరవించి.. పదవులు కట్టబెట్టారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అన్నారు.
కొంత మందిని తొలగిస్తామని.. కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని జగన్ చెప్పారు. మమ్మల్ని కెబినెట్ నుంచి తొలగించే పరిస్థితుల్లో సీఎం జగన్ బాధ పడితే.. నేనే ఫర్వాలేదు.. బాధ పడొద్దని చెప్పాను. మంత్రి పదవి నుంచి తప్పించినప్పుడు కొంత భావోద్వేగానికి గురయ్యాను. నేను థ్యాంక్స్ గివింగ్ నోట్ ఇస్తే.. అది రాజీనామా లేఖగా పొరపాటు పడ్డారు.
Also Read
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
Also Read:Kendriya Vidyalaya: విద్యార్ధులకు షాక్.. ఎంపీ కోటా సీట్ల ఎత్తివేత
ఈ ఎపిసోడుకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నా. సీఎం జగన్ నన్ను చెల్లిగా చూశారు. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌తోనే ఉంటాను. రాజకీయాలకు దూరంగా ఉండదల్చుకుంటే వైసీపీ కార్యకర్తగా.. ఓటరుగానే ఉంటాను. 2009 నుంచి జగన్ వెన్నంటే నడిచాను. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాం. మా అమ్మాయి పొరపాటున ఏదో మాట్లాడింది. ఓ చిన్న పిల్ల మాటను పట్టుకుని ఇంత ఇష్యూ చేయడం సరి కాదు. అయినా అప్పుడే పక్కనున్న మా అబ్బాయి థ్యాంక్స్ గివింగ్ లెటర్ అని చెబుతున్నాడు.. కానీ దాన్ని హైలైట్ చేయలేదన్నారు సుచరిత.
సీఎం జగనుతో ఫ్యామ్లీ మెంబర్సుతో వచ్చి కలిసే స్వేచ్ఛ ఉంది. నాకు ఆరోగ్యం సరిగా లేదు.. దీన్ని ఎండ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇబ్బందైనా వచ్చా. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నేను నడుచుకుంటానన్నారు మేకతోటి సుచరిత.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!