Site icon NTV Telugu

Mekapati Chandrasekhar Reddy: శివచరణ్ నా కొడుకే కాదన్న ఉదయగిరి ఎమ్మెల్యే

mekapati

Collage Maker 07 Jan 2023 07.39 Pm

నెల్లూరులో ఒకవైపు ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంటే…మరో వివాదం నలుగుతోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడినని బహిరంగ లేఖ రాసిన మేకపాటి శివ చరణ్ రెడ్డి తన కుమారుడే కాదని ఎం.ఎల్.ఏ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఉదయం నుంచి అందుబాటులో లేని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి.. శివ చరణ్ రెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించి ఒక వీడియోను విడుదల చేశారు. తనకు ఇద్దరు కూతుళ్ళు మాత్రమే ఉన్నారని కొడుకులు లేరని ఆయన స్పష్టం చేశారు.

తన మొదటి భార్య తులసమ్మకు సంతానంగా రచన. రెండో భార్య శాంతకుమారికి సాయి ప్రేమితారెడ్డి ఉన్నారన్నారు. కేవలం డబ్బులు కోసమే తల్లీ, కొడుకులు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. రాజకీయంగా అయితే నేరుగా తనను ఎదుర్కోవాలని చంద్ర శేఖర్ రెడ్డి శివచరణ్ రెడ్డికి సవాల్ విసిరారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలపై శివచరణ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

తన తల్లికి చిన్నతనంలోనే మేనమామ కొండారెడ్డితో వివాహమైందని విభేదాల వల్ల విడిపోగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన తల్లితో సంబంధం పెట్టుకున్నారన్నారు. ఐదేళ్ల తర్వాత తాను జన్మించానని శివ చరణ్ రెడ్డి చెప్పారు. డబ్బు కోసం అయితే ఎప్పుడో అడిగేవాడినని… నా సర్టిఫికెట్ లలో కూడా తండ్రిగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరే ఉందని స్పష్టం చేశారు. డీఎన్ఏ పరీక్షలకు తాను సిద్ధమని…మేకపాటి కొడుకని నిరూపిస్తానని శివచరణ్ రెడ్డి పేర్కొన్నారు. తనకు రాజకీయ వారసత్వం లేదా ఆస్తి అక్కర్లేదని కేవలం గుర్తింపు మాత్రమే కోరుతున్నానని శివ చరణ్ రెడ్డి వెల్లడించారు.

Read Also: Gadala Srinivasa Rao: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యూహం అదేనా?

Exit mobile version