Site icon NTV Telugu

Meher Ramesh : టాలీవుడ్ టాప్ బ్యానర్ నుంచి ఆఫర్ అందుకున్న మెహర్ రమేష్..?

Whatsapp Image 2023 09 14 At 11.48.07 Am

Whatsapp Image 2023 09 14 At 11.48.07 Am

మెహర్ రమేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్‌ సినిమా తీసిన మెహర్ రమేష్‌ ఈ మధ్య భారీగా ట్రోలింగ్‌కు గురయ్యారు.. భోళా శంకర్‌ సినిమా డిజాస్టర్‌ కావడం తో మెహర్ రమేష్ పై తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది.అయితే మెగా స్టార్ తన తరువాత సినిమా మెహర్‌ రమేష్‌తో అని ప్రకటించగానే మొదట్లో మెగా ఫ్యాన్స్‌ బాగా భయపడిపోయారు. అయితే వాళ్లు అనుకున్న అంచనాల ప్రకారమే మెహర్‌ రమేష్‌ భోళా శంకర్ సినిమాను తెరకెక్కించాడు…అయితే ఈ సినిమా చిరంజీవి కెరియర్‌లోనే దారుణమైన డిజాస్టర్‌ గా  మిగిలిపోయింది.. శక్తి, షాడో లాంటి భారీ డిజాస్టర్లు తీసి ఏడెనిమిదేళ్లు గా అవకాశాలు లేక ఖాళీగా ఉన్న ఈ దర్శకుడికి చిరంజీవి అవకాశం ఇవ్వడమేంటి అని అందరికి సందేహం కలిగింది.. కానీ ఇవన్నీ పక్కనబెట్టి చిరంజీవి లాంటి స్టార్‌ హీరో అవకాశం ఇస్తే ఆ భారీ ఆఫర్ ను అస్సలు ఉపయోగించుకోలేక పోయారు మెహర్ రమేష్..

భోళా శంకర్‌ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత మెహర్ రమేష్ ఇక సినిమాలు చేయరని ఆయన ఇండస్ట్రీ లో తేరుకునే అవకాశమే లేదని వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌లో టాప్‌ ప్రొడక్షన్‌ గా గుర్తింపు తెచ్చుకున్న ఒక బ్యానర్‌ నుంచి మెహర్‌ రమేష్‌ కు ఆఫర్‌ వచ్చిందని సమాచారం… తక్కువ బడ్జెట్‌ లో ఒక మూవీ నిర్మించాలని వారు మెహర్ రమేష్ ను కోరారట.. అది కూడా సుమారు రూ. 5 కోట్ల లోపు సినిమాను పూర్తి చేయాలని కండీషన్‌ కూడా పెట్టినట్లు సమాచారం..దీంతో ఆయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడని తెలుస్తుంది.కొత్త వారితో ఈ సినిమా తీసి సూపర్‌ హిట్‌ కొట్టి మళ్లీ టాలీవుడ్‌ రేసులో నిలబడాలని మెహర్ ఎంతో పట్టుదల తో ఉన్నారని సమాచారం.. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం

Exit mobile version