NTV Telugu Site icon

Meghalaya Election Counting Updates : ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తున్న ప్రస్తుత ఫలితాలు

Meghalaya Chunav

Meghalaya Chunav

Meghalaya Election Counting Updates : మేఘాలయ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు దగ్గర సంబంధం కనిపించినట్లు తెలుస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) 60 సీట్లలో దాదాపు 20 స్థానాల్లో ముందంజలో ఉంది, తొలి ట్రెండ్‌లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మెజారిటీ మార్కు 31. తృణమూల్ కాంగ్రెస్ 12 స్థానాలతో రెండో స్థానంలో ఉండగా, బీజేపీ, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) వరుసగా తొమ్మిది, ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. రాష్ట్ర ఫలితాలపై భారీ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాన్రాడ్ సంగ్మా ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు వదులుకున్నారు. ఈ క్రమంలోనే సంగ్మా మీడియాతో మాట్లాడుతూ అనుకున్న స్థానాల్లో గెలిస్తే జాతీయ స్థాయిలో ఈశాన్య రాష్ట్రాల గళం వినిపించేందుకు పార్టీలతో పొత్తులతో చర్చిస్తామన్నారు. నాలుగు ఎగ్జిట్ పోల్స్ మొత్తం NPP దాదాపు 20 సీట్లు గెలుచుకోవచ్చని సూచించింది.

Read Also: Nagaland Election Counting Updates : నాగాలాండ్‎లో స్పష్టమైన మోజార్టీతో బీజేపీ కూటమి

ఎగ్జిట్ పోల్స్ కూడా 2018లో రాష్ట్రంలో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఆరు సీట్లు గెలుచుకుని తన సంఖ్యను స్వల్పంగా విస్తరిస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్ ఆరు సీట్లు గెలుచుకోవచ్చని, కొత్తగా చేరిన తృణమూల్ కాంగ్రెస్ 11 సీట్లతో ఖాతా తెరవవచ్చని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. ఆ క్రమంలోనే 2018లో బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే NPPతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. సంగ్మా పార్టీపై అవినీతి ఆరోపణలతో విభేదాలు రావడంతో ఈసారి రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఫిబ్రవరి 27న రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 59 స్థానాల్లో పోలైన ఓట్లను రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాల్లో లెక్కిస్తున్నారు. అభ్యర్థి మృతితో సోహియాంగ్ స్థానంలో పోలింగ్ వాయిదా పడింది.

Read Also:Nagaland Election Counting Updates : నాగాలాండ్‎లో స్పష్టమైన మోజార్టీతో బీజేపీ కూటమి