Site icon NTV Telugu

Meghalaya Coal Mine Explosion: బొగ్గుగనిలో పేలుడు.. 16 మంది కార్మికులు మృతి, కొనసాగుతున్న రక్షణ చర్యలు!

Megalaya

Megalaya

Meghalaya Coal Mine Explosion: మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్ జైంటియా హిల్స్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో బొగ్గు గనిలో పేలుడు సంభవించి 16 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక పరిపాలన అధికారులు, SDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి.

Vivo X200T Review: మూడు 50MP కెమెరాస్, 6200mAh బ్యాటరీ.. ‘వివో ఎక్స్‌200టీ’ రివ్యూ!

అధికారుల తెలిపిన సమాచారం ప్రకారం.. తాశఖై ప్రాంతంలోని కోయిల గనిలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. పేలుడు ప్రభావంతో గనిలో ఉన్న కార్మికులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇప్పటివరకు 16 మృతదేహాలను వెలికితీశారు అధికారులు. ఇంకా కొంతమంది కార్మికులు గనిలో చిక్కుకుని ఉండే అవకాశముందని అధికారులు తెలిపారు. మృతులందరూ అస్సాం రాష్ట్రానికి చెందిన కార్మికులేనని ప్రాథమిక సమాచారం.

Bhumana Karunakar Reddy: స్వామికి చంద్రబాబు ఒక్కడే భక్తుడా? టీటీడీ మాజీ ఛైర్మన్ ఫైర్

ఈ ఘటన థాంగ్‌ స్కూ ప్రాంతంలో జరిగిందని మేఘాలయ పొలిసు అధికారి తెలిపారు. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు జరిగిన సమయంలో గనిలో ఎంతమంది ఉన్నారన్నదానిపై స్పష్టత ఇంకా లేదు. ఈ ప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా గ్యాస్ లీక్ లేదా సాంకేతిక లోపం వల్ల పేలుడు జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు అధికారులు. అయితే పూర్తి దర్యాప్తు తర్వాతే అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Exit mobile version