NTV Telugu Site icon

Megha aakash: క్యూట్ బ్యూటీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్

Megha Aakash

Megha Aakash

Megha aakash: నితిన్ ‘లై’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాశ్‌ ప్రస్తుతం నాలుగైదు తెలుగు సినిమాలలో నాయికగా నటిస్తోంది. అయితే.. ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించాలే కానీ సెకండ్ లీడ్ పోషించడానికీ మేఘా వెనకడటం లేదు. దాంతో ఆమె చేతిలో సినిమాలు బాగానే ఉంటున్నాయి. ఇటీవల చిత్ర నిర్మాణంలోనూ మేఘా ఆకాశ్‌ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే త్రిగుణ్‌, మేఘా ఆకాశ్‌ జంటగా నటించిన ‘ప్రేమదేశం’ మూవీ డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. శిరీష సిద్ధం నిర్మించిన ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ సిద్థం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్ భామ మధుబాల ఇందులో ప్రాధాన్యమున్న పాత్రను పోషించింది. నిజానికి ఈ సినిమా కొన్ని నెలల ముందే రావాల్సింది. మొత్తానికి డిసెంబర్ 2న ఇప్పుడు లాక్ చేశారు.

Read Also: Black Rice: బ్లాక్ రైస్‌తో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

ఇక్కడే ఇంకో విశేషం కూడా ఉంది. మేఘా ఆకాశ్ కీలక పాత్ర పోషించిన మరో సినిమా ‘గుర్తుందా శీతాకాలం’ సైతం డిసెంబర్ 9న జనం ముందుకు వస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి, వచ్చి ఇప్పుడు 9వ తేదీకి కన్ఫర్మ్ అయ్యింది. ‘లవ్ మాక్ టైల్’ అనే కన్నడ చిత్రానికి ఇది రీమేక్. సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన ఈ సినిమాలో మేఘా ఆకాశ్ కీ-రోల్ ప్లే చేసింది. సో.. ఈ ఏడాది చివరి నెలలో మేఘా నటించిన రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ విడుదల అవుతున్నాయి. మరి వీటి విజయంతో ఈ సంవత్సరానికి ఈ క్యూట్ బ్యూటీ హ్యాపీగా గుడ్ బై చెబుతుందేమో చూడాలి.

Read Also: మన దేశంలో ఉన్న టాప్-10 అందమైన ఎయిర్‌పోర్టులు

Show comments