NTV Telugu Site icon

Vishwambhara : యంగ్ హీరోకి పోటీగా రానున్న మెగాస్టార్ !

New Project (57)

New Project (57)

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన హీరోగా న‌టించిన ఎన్నో చిత్రాల్లో తేజ స‌జ్జా చిరంజీవి చిన్న నాటి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తేజ యంగ్ చ యబమఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాల‌తో ఆ సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయింది. అయితే ఇప్పుడిదే హీరోతో మెగాస్టార్ చిరంజీవి పోటీకి దిగుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో ‘విశ్వంభర’ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇది కూడా సోషియా ఫాంట‌సీ చిత్రం. ‘జ‌గ‌దీక వీరుడు అతిలోక సుంద‌రి’, ‘అంజి’ త‌ర్వాత ఆయన నటిస్తోన్న మరో సోషియా ఫాంట‌సీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది.

Read Also:Bhatti Vikramarka: రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్న డిప్యూటీ సీఎం

చాలా గ్యాప్ త‌ర్వాత సోషియా ఫాంట‌సీని చిరు ట‌చ్ చేయ‌డంతో? యంగ్ హీరో తేజ‌కి పోటీగా దిగుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే చిరు కంటే ముందే ‘హ‌నుమాన్’ తో తేజ ఆ జాన‌ర్ లో సినిమా చేశాడు. ‘మిరాయ్’ కూడా అదే జానర్లో తెరకెక్కుతుంది. పైగా చిరంజీవి చిన్నప్పటి పాత్రలను పోషించిన తేజ తో చిరు పోటీ అన్నది అభిమానులకు క్రేజీగా ఉంది. మ‌రి ఈ రెండు సినిమాలు ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతిని పంచుతాయో చూడాలి. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాది రిలీజ్ కానున్నాయి. ‘విశ్వంభ‌ర’ వేసవిలో రిలీజ్ అవుతుంద‌ని స‌మాచారం. ‘మిరాయ్’ అప్ డేట్స్ మాత్రం రావ‌డం లేదు. ఈ చిత్రానికి కార్తీక్ ఘ‌ట్టమనేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Read Also:Allu Arjun : పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన అల్లు అర్జున్