Chiranjeevi : ఆ మూవీ కోసం ఒకే షర్ట్ రెండేళ్లు వేసుకున్న మెగాస్టార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా ‘అంజి’.ఈ సినిమా భారీ అంచనాల నడుమ జనవరి 15, 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాగబాబు మరియు టినూ ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. అప్పట్లోనే అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ షూటింగ్ ఏకంగా 5 సంవత్సరాల పాటు కొనసాగింది. అంతేకాదు, ఇంటర్వెల్ సీన్ కోసం ఏకంగా నెల రోజుల పాటు షూటింగ్ జరిపినట్లు అప్పట్లో దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతుంది.‘అంజి’ సినిమాను నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అప్పట్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించారు.అంజి సినిమాకు ఖర్చు విషయంలో ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ సినిమా కోసం చిరంజీవి ఎంతో కష్టపడ్డారని దర్శకుడు కోడి రామకృష్ణ తెలిపారు..
ఈ చిత్రం కోసం చిరంజీవి ఎన్ని రోజులైనా కష్టపడి పని చేస్తానని చెప్పారు. కొత్త ఆర్టిస్టు మాదిరిగానే ఆయన కష్టపడ్డారని కోడి రామకృష్ణ తెలిపారు.. సినిమా మొత్తం ఆయన ఎంతో ఓపికగా నటించారు. ఈ సినిమా కోసం చిరంజీవి ఒక షర్ట్ ను రెండు సంవత్సరాల పాటు వేసుకున్నారు. గ్రాఫిక్స్ కోసం చిరంజీవి డ్రెస్కు మార్కులు పెట్టేవాళ్లం. ఆయన రోజూ అదే డ్రెస్ వేసుకునే వారు. కనీసం ఉతకడానికి కూడా ఉండేది కాదు. అలా రెండేళ్లు అదే షర్ట్ ను వేసుకున్నారు. సినిమా పట్ల ఆయనకు అంత డెడికేషన్ ఉండేది” అని ఆయన వెల్లడించారు.ఈ సినిమా షూటింగ్ కోసం ఎంత కష్ట పడ్డామో, ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ కోసం అంతకంటే ఎక్కువ కష్టపడ్డాం. ఈ సినిమాలో ఒక్కో సీన్ కోసం వందకు పైగా షాట్స్ తీసేవాళ్లం. అంతలా షూట్ చేయాల్సి వచ్చింది కాబట్టే 5 సంవత్సరాలు షూట్ చేశాం. ఈ సినిమా సంబంధించిన గ్రాఫిక్స్ పనులు సింగపూర్, మలేషియా మరియు అమెరికాలో చేయించాం” అని ఆయన వెల్లడించారు. ‘అంజి’ సినిమా అనేది తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ల్యాండ్ మార్క్ చిత్రంగా చెప్పుకొవచ్చు. ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడి పని చేశాం. దర్శకుడిగా నాకు ఎంతో తృప్తినిచ్చిన చిత్రం. అనుకున్న స్థాయిలో ఈ సినిమా ఆడకపోయినా కూడా మేము ఈ సినిమా కోసం పడిన తపన ఎలాంటిది అనేది ఇండస్ట్రీలో వాళ్లు అందరికీ తెలుసు’’అని కోడి రామకృష్ణ ఆ వీడియో లో తెలిపారు.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
#Chiranjeevi గారు ఒకే డ్రెస్ రెండేళ్ళు వేసుకున్నారు
Legendery Director #KodiRK garu about #Anji Movie 🔥 pic.twitter.com/z79gOxKxsF
— Rajesh Manne (@rajeshmanne1) January 16, 2024
తాజావార్తలు
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!