NTV Telugu Site icon

Chiranjeevi : సర్దార్ డైరెక్టర్ కు మెగాస్టార్ ఛాన్స్.. ?

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మెగాస్టార్ సరికొత్త సినిమాను అనౌన్స్ చేశారు. దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరు హీరోగా నేచురల్ నాని, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు చిరు లైనప్ లో ఉన్నాయి.

Read Also:Mollywood : రిస్క్ చేస్తోన్న మాలీవుడ్ ఇండస్ట్రీ.. తేడా వస్తే అంతే.!

బాలకృష్ణ తో భగవంత్ కేసరి, విక్టరి వెంకీ తో F2 వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన అనిల్ రావిపూడి కూడా మెగా స్టార్ చిరుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత సాహూ గారపాటి భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఇందుకు సంబందించిన కథ చర్చలు మెగాస్టార్ తో ముగిశాయని అనిల్ రావిపూడి తెలిపారు. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ప్రస్తుతం అనిల్ దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత చిరు సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు అనిల్ రావిపూడి.

Read Also:Komaram Bheem: వీడి కక్కుర్తి తగలెయ్యా ! చనిపోయిన వ్యక్తి పింఛన్ కాజేసిన బీపీఎం..

వారితో పాటు మరో తమిళ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చేందుకు మెగాస్టార్ సిద్ధమవుతున్నాడట. తమిళ హీరో కార్తితో ‘సర్దార్’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మిత్రన్, మెగాస్టార్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ కథను రెడీ చేశాడట. ఇప్పుడు ఈ కథను చిరంజీవికి వినిపించి ఓకే చేయించుకునే పనిలో తను బిజీగా ఉన్నట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ చిరంజీవి నిజంగానే మిత్రన్‌కు ఈ అవకాశం ఇస్తే, త్వరలోనే మరో సినిమాతో ఆయన మన ముందుకు రావడం ఖాయమని చెప్పాలి.

Show comments