Site icon NTV Telugu

Wayanad Landslides: కేరళ ముఖ్యమంతికి కోటి రూపాయల చెక్‌ అందించిన మెగాస్టార్ చిరు ..

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi – Pinarayi Vijayan: కేరళలోని వాయనాడ్‌ లో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 400 మంది కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం నలుమూలల నుండి ఈ ఘోరమైన ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సంతాపం, ప్రార్థనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, బాధితులను రక్షించడం, పునరావాసం కోసం పలువురు ప్రముఖులు ఉదారంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురువారం నాడు కేరళ రాజధాని తిరువనంతపురంలో దిగి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమయ్యారు.

Taylor Swift: పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ కచేరీపై దాడి చేసేందుకు కుట్ర..

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి కేరళ లోని వయనాడ్‌ బాధితులకు ఆర్థికసాయం ప్రకటించిన సంగతి మనకి తెలిసిందే. కేరళ సీఎం రిలీప్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించిన చిరంజీవి.. అందుకు సంబంధించిన కోటి రూపాయల చెక్కును చిరు కేరళ సీఎంకు అందజేశారు. గడిచిన ఆదివారం నాడు కేరళ కొండచరియల బాధితులకు చిరు, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి కోటి రూపాయల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఆదివారం చిరు తన ట్వీట్‌ లో.. ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం, వందలాది విలువైన ప్రాణాలను కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. వయనాడ్ దుర్ఘటన బాధితులకు నా హృదయం వెల్లివిరుస్తోంది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చరణ్, నేను కలిసి రూ.1 కోటి విరాళంగా బాధితులను ఆదుకుంటున్నాం అని రాసుకొచ్చారు.

Exit mobile version