NTV Telugu Site icon

HBD M. M. Keeravani : మా ‘ఆస్కారుడు’ కు పుట్టినరోజు శుభాకాంక్షలంటున్న మెగాస్టార్..

Keeravani

Keeravani

HBD M. M. Keeravani : నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సంగీత దర్శకుడైన ఎంఎం కీరవాణి తన 63వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ఆయనకు స్పెషల్ వీడియోతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఈరోజే జన్మించిన మా ఆస్కారుడు ఎంఎం కీరవాణి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా చిరంజీవి పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో చిరంజీవి కీరవాణి గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం వారు చేయబోయే ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలను తెలిపారు.

Air India: టీమిండియాను ఇంటికి తీసుకురావడానికి అమెరికా విమానం రద్దు.. నివేదిక కోరిన డీజీసీఏ..

ఇక మెగాస్టార్ చిరంజీవి తాజాగా పంచుకున్న వీడియోలో.. ఒకప్పుడు అందరూ ఒక చోట చేరి సంగీత దర్శకులు ఊహల్లో నుంచి పయనిస్తున్న బాణీలు బాగున్నాయో లేవో చర్చించుకుని ఆమోదముద్ర వేశాకే ఆ పాట బయటికి వచ్చేదని., మరుగున పడిన ఆనవాయితీని గుర్తు చేస్తూ.. మళ్ళీ మాకు కీరవాణి గారు విశ్వంభర కోసం పాటలు కంపోజ్ చేసే ప్రక్రియను మా ఇంట్లో ఏర్పాటు చేశారు. అది జరుగుతున్న సందర్భంలో మాకు పాత రోజులు గుర్తొచ్చాయని చిరంజీవి తెలిపారు. ఆపద్బాంధవుడు సినిమా మ్యూజిక్ కంపోజ్ చేసిన రోజులు గుర్తుకొచ్చాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆపద్బాంధవుడు సినిమాలోని ఆనాటి ఆ మధుర గీతాన్ని ఆయన ఆలపిస్తుంటే మనసు తీయని అనుభూతికి లోనయింది.. దాన్ని మీతో ఇలా పంచుకోవాలని మీ ముందు ఈ వీడియో ఉంచుతున్నట్లు తెలిపారు. మీరు ఎంజాయ్ చేయండి అంటూ అక్కడ జరిగిన పాట ఆలాపనను వీడియోలో ఉంచారు. ఇక చివర్లో ఈరోజు జన్మించిన మా ఆస్కారుడు ఎంఎం కీరవాణి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ వీడియోను ముగించారు.

Mahanandi Temple: మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత కలకలం!

Show comments