Megastar Chiranjeevi- Harish Shankar Movie: ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఆయన సోదరి పాత్రలో మాత్రం కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ సినిమా విడుదలైన వెంటనే మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కురసాల…