Site icon NTV Telugu

Obc MPs Meeting: ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి..

V Hanumantha Rao

V Hanumantha Rao

Obc MPs Meeting: ఢిల్లీలో జరిగిన ఓబీసీ ఎంపీల సమావేశంలో దేశంలో వెనుకబడిన వర్గాల జనాభా పెరిగిన స్థాయిలో వారికి న్యాయం జరగడం లేదని పార్లమెంట్ సభ్యులు మండిపడ్డారు. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు కేశవరావు, ఆర్ కృష్ణయ్య, గోరెంట్ల మాధవ్, బీఎస్పీ ఎంపీ శ్యామ్ సింగ్ యాదవ్, జేడీయూ ఎంపీ గిరిధర్ యాదవ్, పలువురు ఎంపీలు, పీసీసీ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు హాజరయ్యారు. కులగణన చేయాలి , ఓబీసీ రిజర్వేషన్లు 52శాతానికి పెంచాలి, ఓబీసీలపై విధించిన క్రిమిలేయర్ ఎత్తివేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఓబీసీల ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని పలువురు ఎంపీలు సమావేశంలో మాట్లాడారు.

ఓబీసీ ఎంపీల ఫోరమ్ తరపున గత 11 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నామని ఓబీసీ పార్లమెంట్ ఎంపీల ఫోరమ్ కన్వీనర్ వి.హనుమంతరావు అన్నారు. ఐఐటీ, ఐఐఎంలో రిజర్వేషన్లు అమలు చేసేలా కృషి చేశామన్నారు. ఓబీసీ పార్లమెంట్ కమిటీ కూడా ఏర్పడిందన్నారు. ఈరోజు నిర్వహించిన ఓబీసీ ఎంపీల సమావేశానికి ఎంపీలందరు మద్దతు తెలిపారని ఆయన వెల్లడించారు. కులాల వారీగా జన గణన చేపట్టాలని తాను చాలా సార్లు డిమాండ్ చేశానని, కులగణన చేపడతామని 2008లో హోంమంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చినా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదని విమర్శించారు.

Gangster Chhota Rajan: 1999 హత్య కేసులో అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ విడుదల

డబ్బు ఖర్చవుతుందని కుల గణన ఆపడం న్యాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీమిలేయర్‌ను ఎత్తివేయాలని, కేంద్రప్రభుత్వంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని.. న్యాయవ్యవస్థలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అందరిని కలుపుకుని ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తామన్నారు. కులాల వారీగా జన గణన చేపట్టాలని తాను చాలా సార్లు డిమాండ్ చేశానని, కులగణన చేపడతామని 2008లో హోంమంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చినా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. డబ్బు ఖర్చవుతుందని కుల గణన ఆపడం న్యాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీమిలేయర్‌ను ఎత్తివేయాలని, కేంద్రప్రభుత్వంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version