Site icon NTV Telugu

BRS: ఈనెల 18న బీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకుల సమావేశం..

Brs

Brs

సార్వత్రిక ఎన్నికలను బీఆర్ఎస్ సమాయత్తమైంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికలపై గురి పెట్టింది. గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు అందజేయనున్నారు.

Read Also: MP Laxman: శ్రీ రాముని కళ్యాణ ప్రసారాలపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించడం విచారకరం..

మరోవైపు.. పార్టీ నేతలలో సుదీర్ఘ భేటీ నిర్వహించి ఎన్నికల ప్రచారం, వ్యుహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులను ఆహ్వానించనున్నారు. ఈ సమావేశంలో.. బస్సు యాత్రలో భాగంగా రూట్‌ మ్యాప్‌లపై చర్చించనున్నారు. మరోవైపు.. కేసీఆర్‌ యాత్రలో పాల్గొని స్వయంగా రైతుల దగ్గరకు వెళ్లి వారి సాదకబాధకాలను తెలుసుకునేందుకు కార్యాచరణ రూపొందించిన విషయం తెలిసిందే…

Read Also: Actor Died: ఇండస్ట్రీకి షాక్.. గుండెపోటుతో నటుడు మృతి

Exit mobile version