టాలీవుడ్ లక్కీ చార్మ్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. గత ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి పండగ విన్నర్‌గా నిలిచేందుకు సిద్ధమయ్యారు. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మీనాక్షి తన పెళ్లి, కాబోయే భర్త గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు కాబోయే వాడు నటుడు, డాక్టర్ లేదా మిస్టర్ ఇండియా అస్సలు అవ్వకూడదని ఆమె గట్టిగా చెప్పేశారు. తాను ఇప్పటికే ఆ మూడు రంగాల్లో ఉన్నాను కాబట్టి, ఇంట్లో మరో వ్యక్తి అవసరం లేదని.
Also Read : Anil Ravipudi: నాగ్‌తో అదే కావాలంటూ..అనిల్ రావిపూడికి అక్కినేని ఫ్యాన్స్ రిక్వెస్ట్..!
అంతేకాకుండా, తన భర్తకు 100 ఎకరాల రాజ్మా పొలాలు ఉండాలని, ఇంటి పనులైన వంట చేయడం, బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం వంటివి కూడా తెలిసి ఉండాలని సరదాగా కండిషన్స్ పెట్టారు. రిలేషన్ షిప్స్ విషయంలో కూడా చాలా ఓపెన్‌గా స్పందిస్తూ.. అబ్బాయికి గతంలో 3.5 బ్రేకప్స్ ఉన్నా పర్వాలేదని, పొడవుగా ఉంటూ రోజుకు మూడుసార్లు గిఫ్ట్స్ ఇచ్చేవాడే తన ‘రాజు’ అని పేర్కొన్నారు. నవీన్ పొలిశెట్టి మార్క్ కామెడీకి, మీనాక్షి గ్లామర్ అండ్ టైమింగ్ తోడవ్వడంతో ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ థియేటర్లలో నవ్వుల విందు భోజనం వడ్డించడం ఖాయంగా కనిపిస్తోంది.
