Site icon NTV Telugu

Meenakshi Chaudhary : థాయ్ లాండ్ వేకెషన్ లో మీనాక్షి చౌదరి..బోట్ పై విహరిస్తూ స్టన్నింగ్ పోజులు..

Whatsapp Image 2024 03 21 At 10.15.57 Pm

Whatsapp Image 2024 03 21 At 10.15.57 Pm

హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ లో ఈ భామ అదిరిపోయే క్రేజ్ తో ఎంతగానో ఆకట్టుకుంటుంది.మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటోంది.’ఇచట వాహనములు నిలుపరాదు’సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామా ఆ తరువాత రవితేజ నటించిన ‘ఖిలాడీ’ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఈ అమ్మడి లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.అందాలు ఆరబోస్తూ చెలరేగిపోయింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మీనాక్షికి నిరాశ తప్పలేదు.. అలాంటి తరుణంలో అడివి శేష్ సరసన నటించిన హిట్ 2 మూవీ మంచి విజయం సాధించింది.

మీనాక్షి గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే మీనాక్షి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారుతోంది.అయితే చివరగా మీనాక్షి చౌదరి మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించినా కూడా ఆ సినిమాలో మీనాక్షి చౌదరి పోషించిన పాత్ర ఆమె కెరీర్ కి ఏ విధంగానూ ఉపయోగపడలేదు.ప్రస్తుతం ఈ భామ దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా ‘లక్కీ భాస్కర్’ అనే మూవీలో నటిస్తుంది.. ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు.  ప్రస్తుతం మీనాక్షి చౌదరి థాయిలాండ్ లో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. థాయిలాండ్ దీవుల్లో మీనాక్షి బికినీలో మెరిసింది. బోట్ లో విహరిస్తూ ఎంజాయ్ చేస్తుంది.ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో పంచుకుంది.నెటిజన్లు మీనాక్షి అందాలకు ఫిదా అవుతున్నారు.సోషల్ మీడియాలో ఈ అమ్మడి గ్లామర్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Exit mobile version