Site icon NTV Telugu

Meenakshi Chaudhary: నేను డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడుతుంటాను: మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary

Meenakshi Chaudhary

Meenakshi Chaudhary: నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ఈ సంక్రాంతికి వినోదాల విందుని అందించడానికి జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో నవీన్‌ పొలిశెట్టి సరసన హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ మూవీకి కొత్త డైరెక్టర్ మారి దర్శకత్వం వహిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

READ ALSO: Nari Nari Naduma Murari Trailer: ఈ గౌతమ్ ఎవరమ్మా.. ‘నారి నారి నడుమ మురారి’ ట్రైలర్‌ చూశారా!

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాలో తన పాత్ర పేరు చారులత అని తెలిపారు. సంపన్న కుటుంబంలో పుట్టిన తండ్రి గారాల పట్టి లాంటి పాత్ర తనదని వివరించారు. ఆమె తన ఇంట్లో యువరాణిలా పెరుగుతుందని, చాలా మంచి అమ్మాయి అని, అమాయకంగా, సున్నితమైన మనసు కలిగి ఉంటుందని, క్యూట్‌గా బిహేవ్ చేస్తుందని చెప్పారు. ఈ సినిమాలో తనను పూర్తి కామెడీ పాత్రలో చూడబోతున్నారని పేర్కొన్నారు. హీరో నవీన్‌తో వర్క్ చేయడం అనేది.. సినిమా టీచింగ్ స్కూల్ లా ఉందని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ ఒకలా ఉంటే, నవీన్ కామెడీ మరోలా ఉంటుంది. పైగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కామెడీగా ఉన్నా.. నా పాత్ర కాస్త సీరియస్ గా ఉంటుంది. కానీ ఇందులో పూర్తిగా కామెడీగా ఉంటుంది. ఇందులో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. పంచ్ డైలాగ్స్ ని కరెక్ట్ టైమింగ్ లో చెప్పడం అనేది ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే ఎక్కువ ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు. కామెడీ అనేది చాలా కష్టం. పైగా ఇందులో కామెడీ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది.

అలాగే ఈ సినిమాలో భీమవరం బాల్మా, రాజు గారి పెళ్ళిరో లాంటి క్యూట్ మాస్ డ్యాన్స్ నెంబర్స్ ఉన్నాయి. సాధారణంగా నేను డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడుతుంటాను. కానీ ఈ సినిమాలో అలాంటి ఇబ్బంది కలగలేదు. చాలా సరదాగా షూట్ చేశాము. ఇందులోని ప్రతి పాట బాగా వచ్చిందని చెప్పారు.

READ ALSO: India vs New Zealand 1st ODI: భారత్ టార్గెట్ 301 పరుగులు..

Exit mobile version