NTV Telugu Site icon

Meenakshi Chaudhary : తెలుగులో మరో ఆఫర్ అందుకున్న హాట్ బ్యూటీ..?

Whatsapp Image 2023 07 24 At 3.44.12 Pm

Whatsapp Image 2023 07 24 At 3.44.12 Pm

హాట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఆ తరువాత మాస్ రాజా రవితేజ తో ఖిలాడి సినిమా లో నటించింది. ఆ సినిమాలో తన నటనతో నే కాకుండా గ్లామర్ పరంగా ఎంతో ఆకట్టుకుంది..కానీ ఆ సినిమా అంత గా ఆకట్టుకోలేదు.. ఇటీవల ఈమె అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2 మూవీలో నటించింది. ఈ సినిమా తో మంచి విజయం అందుకుంది ఈ భామ. హిట్ 2 సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ భామ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుంది.. ఈ సినిమా లో మొదట పూజా హెగ్డే ను హీరోయిన్‌గా తీసుకున్నారు.కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

దీనితో పూజా హెగ్డే స్థానం లో శ్రీలీలను తీసుకోవడం జరిగింది.అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసారు మేకర్స్.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.ఇది ఇలా ఉంటే ఈ భామకు తెలుగులో మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.వరుణ్ తేజ్ హీరో గా నటించబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా ఈ భామకు అవకాశం వచ్చినట్టు సమాచారం . కాగా వరుణ్ తేజ్ పలాస ఫేమ్ కరుణ కుమార్‌తో ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల27న గ్రాండ్‌గా లాంఛ్ కానుందని సమాచారం.ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి దాదాపు ఫైనల్ అయ్యినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం నేపథ్యంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

Show comments