Site icon NTV Telugu

Crime News: మేడిపల్లిలో దారుణం.. గర్భవతైన భార్యను రంపంతో ముక్కలుగా కోసి హత్య చేసిన భర్త!

Horrific Murder Medipally

Horrific Murder Medipally

Horrific Murder in Medipally: మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పరిధిలోని బాలాజీ హిల్స్‌లో దారుణం ఘటన చోటుచేసుకుంది. భార్య గర్భవతి అనే కనికరం కూడా లేకుండా.. రంపంతో కోసి హత్య చేశాడు ఓ భర్త. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి కవర్‌లో ప్యాక్‌ చేశాడు. కవర్‌ను బయటకు తీసుకెళ్లి పడేసేందుకు రెడీ అయ్యాడు. అప్పటికే గది నుంచి శబ్దాలు రావడంతో.. ఇరుగుపొరుగు వారి ఇంట్లోకి వెళ్లి చూడటంతో అసలు విషయం బయటపడింది.

వికారాబాద్ కామారెడ్డి గూడకి చెందిన యాదవ కులానికి చెందిన స్వాతి (22) అలియాస్ జ్యోతి.. అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం స్వాతి గర్భవతి. ఇద్దరు 25 రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి బోడుప్పల్‌లోని బాలాజీ హిల్స్‌లో అద్దెకు ఉంటున్నారు. మహేందర్ రెడ్డి రాపిడో నడుపున్నాడు. ఇద్దరి మద్యం ఏం జరిగింది అనేది తెలియదు కానీ.. స్వాతిని మహేందర్ దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడు మహేందర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read: Horoscope Today: ఆదివారం దినఫలాలు.. ఆ రాశి వారికి నేడు అన్ని శుభవార్తలే!

గతంలో స్వాతి, మహేందర్ రెడ్డిలు బాలాజీ హిల్స్‌లోని ఇదే ఇంట్లో ఓ పది నెలలు ఉండి వెళ్లినట్లు స్థానికులు చెప్తున్నారు. మరలా 25 రోజుల క్రితం అద్దెకు ఇక్కడికి వచ్చారట. వీరు ప్రేమ వివాహం ఎప్పుడూ చేసుకున్నారనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాళ్లు, చేతులు, తల వేరు చేసి ఎక్కడో వేసినట్లు తెలుస్తోంది. ఆ భాగాలూ ఇంకా పోలీసులకు దొరకనట్లు తెలుస్తుంది. కేవలం ఛాతీ భాగంలో ఉన్న భాగం మాత్రమే ఇంట్లో ఉంది. చేతులు, భుజాలు, కాళ్లు, తల కట్ చేసినట్లు సమాచారం.

Exit mobile version