వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే.. ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని… వెంటీలేటర్ , ఎక్మో పై చికిత్స కొనసాగిస్తున్నట్లు సమాచారం. ప్రీతిని రక్షించేందుకు నిమ్స్ వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది.
Also Read : Earthquake: గుజరాత్‌లో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
ప్రీతి తండ్రి మీడియాతో మాట్లాడుతూ, వైద్యులు కష్టమేనని అంటున్నారని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రీతి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు చెబుతున్నారని వెల్లడించారు. చికిత్స కొనసాగుతోందని వారు చెబుతున్నా, తమకు సందేహంగానే ఉందని అన్నారు. నిన్నటి వరకు కొంత ఆశ ఉండేదని, ఇప్పుడది కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కాసేపట్లో ప్రీతి ఆరోగ్యంపై వైద్యులు ప్రత్యేక బులెటిన్ విడుదల చేయనున్నారు. నిమ్స్ వద్ద భద్రతను పెంచారు.
Also Read : Boat Accident: ఇటలీ తీరంలో విషాదం.. శరణార్థుల పడవ మునిగి 34 మంది మృతి
