NTV Telugu Site icon

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు పూర్తి.. రౌస్‌ అవెన్యూ కోర్టుకు..!

Kavitha Ed Vicharana

Kavitha Ed Vicharana

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు మరోసారి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇవాళ ఉదయం మహిళా వైద్యుల బృందం ఇడి కేంద్ర కార్యాలయం పరివర్త్ భవన్‌కు వెళ్లి కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న (శుక్రవారం) సాయంత్రం హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లో ఆమెను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఢిల్లీలోని తమ కార్యాలయానికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. విమానాశ్రయంలో ఈడీ అధికారులు కవితను మీడియాకు కనిపించకుండా వేరే గేటు ద్వారా తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. పరివర్త్ భవన్ వద్ద 144 సెక్షన్ విధించారు.

Read also: Telangana Weather: తగ్గుతున్న ఎండలు.. తెలంగాణకు 4 రోజులపాటు వర్షాలు..

కవితను ఈడీ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌లో ఉంచారు. అక్కడ వైద్య బృందం ఆమెకు పరీక్షలు నిర్వహించింది. ఉదయం 10.30 గంటలకు కవితను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మరి కవితను కోర్టు ఈడీ కస్టడీకి ఇస్తుందా.. లేదా అనేది చూడాలి. ఈడీ కస్టడీకి ఇవ్వకపోతే 14 రోజుల రిమాండ్‌కు అవకాశం ఉంది. కాగా, తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ కవిత రూస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె న్యాయవాద బృందం బెయిల్ పిటిషన్‌ను సిద్ధం చేస్తోంది.

RCB vs MI: 4 పరుగులు ఇచ్చి ఓ వికెట్.. ఆర్‌సీబీ గేమ్ ఛేంజర్ శ్రేయాంక పాటిల్!

ప్రధానంగా అమిత్ అరోరా ఇచ్చిన సమాచారం మేరకే కవితను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. గత నాలుగు రోజులుగా అమిత్ అరోరాను విచారించగా.. సౌత్ లాబీకి సంబంధించి ఈడీకి కీలక సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సౌత్ లాబీ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. దీంతో.. ఇవాళ ఉదయం అమిత్ అరోరాను కలిసి కవితను మరోసారి విచారించనున్నారు. మధ్యాహ్నం తర్వాత కవితను కోర్టులో హాజరుపరచనున్నారు. అనంతరం ఈడీ అధికారులు కస్టడీ కోరనున్నారు. కవితను ఢిల్లీ ఈడీ కార్యాలయానికి తరలించడంతో ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. కవిత అరెస్ట్ తర్వాత ఢిల్లీ ఈడీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
IPL 2024-BCCI: భారత అభిమానులకు షాక్.. యూఏఈలో ఐపీఎల్ 2024!