NTV Telugu Site icon

Raging in MBBS College: ఎంబీబీఎస్ కాలేజీలో ర్యాగింగ్‌.. 3 గంటలు నిలబడి డ్యాన్స్ చేస్తూ విద్యార్థి మృతి!

Patna

Patna

గుజరాత్‌ రాష్ట్రం పటాన్‌లోని ధర్‌పూర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సీనియర్ల ర్యాగింగ్ కారణంగా ఓ వైద్య విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన తర్వాత, కళాశాల అడ్మినిస్ట్రేషన్ 15 మంది సీనియర్ విద్యార్థులను అకడమిక్, హాస్టల్ కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేసింది. ఈ విషయమై ధర్‌పూర్ మెడికల్ కాలేజీ అదనపు డీన్ పటాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నవంబర్ 1న అనిల్ మెథానియా మరణించారని, ఆ తర్వాత కాలేజీ డీన్ హార్దిక్ షా ర్యాగింగ్ నిరోధక కమిటీని ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కమిటీ విచారణ ప్రారంభించింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అసలు ఏం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం.. మొదటి సంవత్సరం విద్యార్థులను సీనియర్ విద్యార్థులు రాత్రి 8:30 గంటలకు పరిచయం చేసుకునేందుకు పిలిచారు. జూనియర్ విద్యార్థులు వెళ్లారు. అందులో చనిపోయిన విద్యార్థి అనిల్ కూడా ఉన్నాడు. ఈ సమయంలో సీనియర్లు జూనియర్లపై ర్యాగింగ్ ప్రారంభించారు. సినిమా పాటలు పాడుతూ.. డ్యాన్ చేయాలని అనిల్ ని సీనియర్లు పోర్స్ చేశారు. అతనిని దుర్భాషలాడాడు, మూడు గంటల పాటు అలాగే నిలబెట్టారు. అనిల్ ఆరోగ్యం క్షీణించడంతో తల తిరగడంతో కింద పడిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

15 మంది సీనియర్ విద్యార్థులు సస్పెండ్..
ఈ ఘటనపై కళాశాల కమిటీ ఇతర సీనియర్ విద్యార్థులను కూడా విచారించింది. వారు మొదటి సంవత్సరం విద్యార్థులు చెప్పిన విషయాన్ని సమర్థించారు. నిజంగానే ర్యాగింగ్ జరిగిందని తెలిపారు. దీని తర్వాత కమిటీ 15 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పటాన్ పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని 105, 127(2), 189(2), 190, 296(బి) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. కాలేజీలోని సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ ఎస్పీ కేకే పాండ్య తెలిపారు. ఈ కేసును పూర్తిగా నిష్పక్షపాతంగా విచారించేందుకు వీలుగా సీనియర్‌ విద్యార్థులను అకడమిక్‌, హాస్టల్‌ కార్యకలాపాల నుంచి సస్పెండ్‌ చేశామని కళాశాల యాజమాన్యం చెబుతోంది. ర్యాగింగ్‌ను యాంటీ ర్యాగింగ్‌ కమిటీ నిర్ధారించి కఠిన చర్యలు తీసుకుంటోంది.