Medha School Drugs: మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో అసలు ఏం జరుగుతోంది? సీనియర్ కెమిస్ట్రీలు తయారు చేయలేని రీతిలో మత్తు మందును ఓ స్కూల్ కరస్పాండెంట్ ఎలా తయారు చేశాడు? ప్రతినిత్యం కిలో చొప్పున మత్తుమందును తయారుచేసి కల్లు డిపోలకి సరఫరా చేస్తున్న జయప్రకాష్ గౌడ్ రిమాండ్ రిపోర్టులో ఏముంది?
సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్లో ఆల్ఫ్రాజోలం తయారీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆల్ఫ్రాజోలం తయారు చేసేందుకు మేధా స్కూల్ కరస్పాండెంట్ జయప్రకాశ్ అనేకమార్లు ప్రయత్నించినట్లు ఈగల్ దర్యాప్తులో బయటపడింది. ఈ కేసులో జయప్రకాశ్‌గౌడ్‌తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన ఈగల్ టీం.. కోర్టులో హాజరుపర్చి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.
The Great Pre Wedding Show : ఆసక్తికరంగా ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్
జయప్రకాశ్ గౌడ్ రిమాండ్ రిపోర్టులో చాలా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అతను సులువుగా డబ్బు సంపాదనే లక్ష్యంగా ఈ మత్తు దందాలోకి దిగాడు. తొలుత ఓల్డ్ బోయినపల్లిలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని మేధా హైస్కూల్ ప్రారంభించాడు. ఆ తర్వాత క్రమంలో గురువారెడ్డి అనే ఆల్ఫ్రాజోలం తయారీదారుడి నుంచి ఫార్ములా కొనుక్కున్నాడు. తన స్కూల్లోనే మత్తుపదార్థాలు తయారు చేస్తే ఎవరికి తెలియకుండా ఉంటుందని మాస్టర్ ప్లాన్ వేశాడు. అంటే స్కూల్లో అయితే ఎవరికీ అనుమానం రాదనేది జయప్రకాశ్ గౌడ్ ప్లాన్. స్కూల్లో కెమిస్ట్రీ ల్యాబ్ ఉన్నట్లుగానే అంతా సెటప్ చేశాడు. ఎవరైనా అడిగితే సైన్స్ ల్యాబ్ అని చెప్పవచ్చు అనుకున్నాడు. కొన్ని సందర్భాల్లో విద్యాశాఖ అధికారులు వచ్చి తనిఖీ చేసి వెళ్లారు. అప్పుడు కూడా దానిని సైన్స్ ల్యాబ్‌గానే చూపెట్టాడు. విద్యార్థుల ప్రయోగాల కోసం సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశానని చెప్పి అందులో 6 రియాక్టర్లతో డ్రగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు.
ఇక అంతా అనుకున్నట్లుగా సెటప్ చేసిన తర్వాత.. జయ ప్రకాశ్ గౌడ్ డ్రగ్స్ తయారీకి అవసరమైన కెమికల్స్, ఇతర పదార్థాలను రాత్రి సమయాల్లో తెచ్చేవాడు. ఉదయం పాఠశాల నడిచే సమయంలో ఆ రెండు గదులకు తాళం వేసి ఉంచేవాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా వెళ్లిన తర్వాత ఆల్ఫ్రాజోలం తయారీ మొదలు పెట్టేవాడు. ఇలా ఆరుసార్లు ఫెయిల్ అయినా.. ఏడో సారి సక్సె్‌స్ సాధించాడు. తాను తయారుచేసిన మత్తుమందుతో కిక్కు రావడంతో వినియోగారులు హ్యాపీగా ఫీలయ్యారని విచారణలో భాగంగా జయప్రకాశ్‌గౌడ్ చెప్పినట్టు తెలిసింది. రోజుకు కిలో చొప్పున ఆల్ఫ్రాజోలం తయారు చేసే జయ ప్రకాశ్‌గౌడ్.. దాన్ని మొత్తం స్కూటీపై తీసుకువెళ్లి సప్లై చేసేవాడు. చాలా సందర్భాలలో పోలీసులు స్కూటీ అని చెక్ చేశారు. అయితే కేవలం వాహనం సంబంధించిన పేపర్లను మాత్రమే చెక్ చేసి పంపించారు ఎప్పుడు కూడా బ్యాగులో ఏముంది అనే విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు.
IAS Transfers: రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీలు..
ఇలా అయితే ఎవరూ తనను అనుమానించరన్న ధీమాతోనే ఇలా చేసేవాడని తెలిసింది. దాడి చేసిన ఈగల్ అధికారులు జయప్రకాశ్‌గౌడ్ అతడి వద్ద నుంచి 3.5 కిలోలు, పాఠశాలలో తనిఖీలో మరో 4.3 కిలోల ఆల్ఫ్రాజోలం, 23 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు మొత్తం కూడా ఫ్యాక్టరీలోని చిత్తు పేపర్ల మాటున డస్ట్ బిన్‌లో దాచి పెట్టాడు. డబ్బుని ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పడి వేశాడు. ఫ్యాక్టరీ లోపలికి ఒక్కడు మాత్రమే వెళ్లేవాడు ఇతరులు ఎవరిని కూడా అనుమతించేవాడు కాదు. తాను ఒక్కడే అన్ని ఫార్ములాలు తయారుచేసి తయారైన డ్రగ్స్ తీసుకెళ్లి బయట అమ్మేవాడు. జయప్రకాశ్‌ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు గురువారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో గురువారెడ్డిని పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
