Site icon NTV Telugu

Edupayala Durgamma Temple: వరద నీటిలోనే ఏడుపాయల దుర్గమ్మ

Edupayala

Edupayala

భారీవర్షాల ప్రభావం, మంజీరా నది విశ్వరూపంతో మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గమ్మ ఆలయం ఇంకా వరద నీటిలోనే వుండిపోయింది. పాపన్నపేటలోని ఏడు పాయల ఆలయం ముందు ఇంకా వరద ప్రవాహం తగ్గలేదు. గత వారం రోజులుగా జలదిగ్బంధంలోనే వన దుర్గా భవానీ ఆలయం వుండిపోయింది. అమ్మవారి గర్భగుడి దర్శనానికి వచ్చే భక్తులకు నిరాశ తప్పడంలేదు. అమ్మవారి పాదాలను తాకుతూ ప్రవహిస్తోంది మంజీరా నది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి.

Read Also: Teacher Beaten By Students: మానకొండూరులో దారుణం.. విద్యార్ధుల్ని చితకబాదిన టీచర్

గతంలో వర్షాకాలంలో అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే వుండడం సర్వసాధారణం. కానీ ఈ ఏడాది అక్టోబర్ నెలలోనూ అమ్మవారిని వరద వీడడం లేదు. దీంతో అమ్మవారి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు నిరాశ తప్పడంలేదు. రోజూ వేలాదిమంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. వరద ప్రవాహం ఎక్కువగా వుండడంతో భక్తుల రావద్దని అధికారులు సూచించారు. పచ్చని అడవి మరియు డెన్ లోపల సహజ రాతి నిర్మాణాల మధ్య ఉన్న సుందరమైన మందిరం ఇది.

ఈ ఆలయాన్ని సందర్శిస్తే తమ కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తారు. వర్షాకాలంలో వరద ఆలయంలోపలికి ప్రవశిస్తుంది. దుర్గభావానీ పాదానికి చేరుకుంటుంది. ఈ అద్భుతమైన సంఘటనను చూడటానికి వేలాది మంది భక్తులు ఏడుపాయలకు వస్తుంటారు. కానీ ఈసారి ఆలయం ఎక్కువగా వరద నీటిలోనే ఉండిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో వరద నీటి సవ్వడి తప్ప భక్తుల సందడి కనిపించడం లేదు.

 

Read Also: Cricket: వన్డే ప్రపంచకప్‌-2023ను బాయ్‌కాట్ చేయనున్న పాకిస్థాన్

Exit mobile version