మెదక్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ.. దేశంలో 400 సీట్లు గెలుస్తాం…అందులో మెదక్ సీటు కూడా ఉందన్నారు. రేపు నామినేషన్ లు వేసే వ్యక్తి కులాన్ని నమ్ముకొని వస్తున్నారు.. ఇంకో ఆయన సూట్ కేసులను నమ్ముకొని వస్తున్నారు.. మోడీ గ్యారేంటి అంటే అమలయ్యే గ్యారేంటి.. హరీష్ రావు నీ మామను కామారెడ్డిలో ఓడించింది కాషాయపు జెండా.. నీ మరదలు కవితను నిజామాబాద్ లో తొక్కితే తీహార్ జైలుకు పోయారని విమర్శలు గుప్పించారు. వెంకట్రామిరెడ్డి కూడా జైలుకు పోయడం ఖాయం.. కేసీఆర్ కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న వెంకట్రామిరెడ్డి రఘునందన్ గురించి మాట్లాడుతారా అని మండిపడ్డారు.
Read Also: PBKS vs MI: ముంబై ఇండియన్స్ భారీ స్కోర్.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే..?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా చేసుకొని కుంభకోణాలు చేశారు.. బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ.. అది నేడు లేదు, రేపు అవసరం లేదన్నారు. కేసీఆర్ ఒక్కరోజు కూడా సెక్రెటరీయేట్ కు రాలే.. కేసీఆర్ ను పర్మనెంట్ గా ఫామ్ హౌజ్ లో ఉంచారు.. ఆరు గ్యారెంటీల సంగతి చెప్పిన తర్వాతనే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు ఓట్లు అడగాలి అని ఆయన డిమాండ్ చేశారు. రైతులు ప్రైవేట్ అప్పులు తీసుకొని ఆత్మహత్యలు చేరుకుంటున్నారు.. దీనికి కారణం రాహుల్ గాంధీ, కేసీఆర్ కూతురు ఢిల్లీ లో లిక్కర్ వ్యాపారం చేసి జైలు పాలు అయింది.. కేసీఆర్ కూతురు తెలంగాణ పరువు, మహిళల పరువు తీసింది అని ఆయన మండిపడ్డారు. అవినీతి పరులు ఎవరైనా బీజేపీ వదిలి పెట్టదు.. సీఎం గాని, వారి కుటుంబ సభ్యులైన వదిలి పెట్టదు.. ఆరు గ్యారెంటీల అమలు కోసం ఊర్లల్లో నుంచి కాంగ్రెస్ నేతలను తరిమి కొట్టండి అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.