MEA on Qatar: ఖతార్ కోర్టు భారత మాజీ నేవీ సిబ్బంది మరణశిక్షను తగ్గించిన తర్వాత, ప్రభుత్వం ఈ కేసులో పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. దీనిపై న్యాయ బృందంతో చర్చిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం మాట్లాడుతూ, ‘ఖతార్ సమస్యపై వివరణాత్మక ఆర్డర్ కాపీ ఇంకా రానందున నేను పెద్దగా వ్యాఖ్యానించడానికి ఇష్టపడను? ఇది సున్నితమైన విషయం, మా ఆందోళన 8 మంది భారతీయులు, వారి కుటుంబాల ప్రయోజనాలకు సంబంధించినది. ఈ కారణంగా మేము కొంచెం వేచి ఉండవలసి ఉంటుంది.” అని పేర్కొన్నారు.
Read Also: Bihar: రహస్య సమావేశం, సీఎంగా తేజస్వి.. జేడీయూ చీఫ్‌గా లలన్‌సింగ్ తొలగింపు స్టోరీ ఇదే!
ఊహాగానాలపై శ్రద్ధ చూపవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. భారతీయులు, వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాలే మా అతిపెద్ద ఆందోళన అని కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. తదుపరి చర్యల గురించి న్యాయ బృందం, కుటుంబ సభ్యులతో తప్పకుండా చర్చిస్తామని ఆయన చెప్పారు.
ఖతార్‌తో చర్చలు కొనసాగుతాయి..
ఎనిమిది మంది మాజీ భారత నేవీ అధికారుల మరణశిక్షను ఖతార్ కోర్టు గురువారం తగ్గించిందనే విషయం తెలిసిందే. దహ్రా గ్లోబల్ కేసులో గత ఏడాది భారత మాజీ నేవీ అరెస్టయ్యారు. గూఢచారం ఆరోపణలపై వారికి గతంలో విధించిన మరణశిక్ష గురువారం తగ్గించబడింది. ఖతార్‌తో చర్చలు కొనసాగుతాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.