Site icon NTV Telugu

NEET 2024: తమ్ముడిని డాక్టర్‌ చేయాలని నీట్‌ పరీక్ష రాసిన ఎంబీబీఎస్ విద్యార్థి.. కానీ?

Neet 2024

Neet 2024

NEET 2024: ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసి అడ్డంగా దొరికిపోయిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ యూజీపరీక్షలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన నీట్ పరీక్షలో రాజస్థాన్‌లో ఓ విద్యార్ధికి బదులు మరొక విద్యార్ధి పరీక్షకు హాజరై పట్టుబడ్డాడు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ్ముడు నీట్ పరీక్ష రాయాల్సి ఉండగా.. అతని అన్నయ్య హాజరయ్యాడు. అసలు అభ్యర్ధికి బదులు డూప్లికేట్ అభ్యర్థి పరీక్షకు హాజరైనట్లు పరీక్ష నిర్వహణ అధికారులు గుర్చింటి. వెంటనే పోలీసులను పిలిపించగా.. సోదరులిద్దరినీ అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Read Also: Rafah crossing: రఫా క్రాసింగ్ లోని పాలస్తీనా భాగాన్ని ఆధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్

నీట్ యూజీ పరీక్ష కోసం బార్మర్‌లో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన అంత్రిదేవి ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో చోటుచేసుకుంది. అతడి హాల్ టికెట్, ధ్రువపత్రాలను తనిఖీ చేయగా.. పరీక్ష రాసే అభ్యర్థి వేరని తేలింది. దీంతో ఇన్విజిలేటర్ పోలీసులకు ఫోన్ చేసి నిందితుడిని వారికి అప్పగించాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అతడిని అదుపులోకి విచారించగా.. నిజం అంగీకరించాడు. తన పేరు భగీరథ్ రామ్ అని.. తన తమ్ముడు గోపాల్ రామ్ స్థానంలో డమ్మీ అభ్యర్థిగా పరీక్ష రాసేందుకు వచ్చినట్లు పోలీసులకు వెల్లడించాడు. కాగా భగీరథ్ రామ్ గతేడాదే నీట్‌ యూజీ పరీక్షను క్లియర్‌ చేశాడు. అనేక ప్రయత్నాల తర్వాత అతడు నీట్ పరీక్షలో విజయం సాధించాడు. ప్రస్తుతం జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో భగీరథ్ రామ్ ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

Read Also: Lok Sabha Elections 2024: గాంధీ కుటుంబానికి కంచుకోటగా మారిన రాయ్ బరేలీ పరిస్థితేంటి..?

తమ్ముడి స్థానంలో పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన భగీరథ రామ్ అనేక ప్రయత్నాల అనంతరం నీట్‌ తర్వాత గతేడాది జరిగిన నీట్ యూజీ పరీక్షలో విజయం సాధించాడని, జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. తన తమ్ముడిని వైద్యుడిని చేసేందుకు, అతడి స్థానంలో నకిలీ అభ్యర్థిగా పరీక్ష రాయడానికి వచ్చి పట్టుబడినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు భగీరథ్‌తోపాటు, అతడి సోదరుడు గోపాల్ రామ్‌తోపాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version