Hotel Raids : హైదరాబాద్‌లో ఇటీవల హోటల్స్‌లో ఆహార పదార్థాల అపరిశుభ్రత, నిల్వ ఉంచిన మాంసం, సరైన నిబంధనలు పాటించకపోవడం, కస్టమర్లకు వడ్డించిన ఆహారంలో పురుగులు, కీటకాలు కనిపించడం వంటి సంఘటనలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలలో బాధితులు వాటి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుండగా, నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి, పలు హోటల్స్‌ను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరంలోని లక్డీకాపూల్ పరిధిలోని పలు హోటల్స్‌లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆమె ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లతో కలిసి ఆయా హోటల్స్‌లో ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. మొఘల్ రెస్టారెంట్‌లో తనిఖీ చేసిన సమయంలో కిచెన్ శుభ్రంగా లేని కారణంగా మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలను సరైన నాణ్యతతో తయారు చేయకుండా నిల్వ ఉంచిన మాంసంపై యజమానిని నిలదీశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ నిల్వ చేసిన మాంసం నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ హెచ్చరించారు.
ఈ సందర్బంగా Ntvతో మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. ‘ఈ మధ్య కాలంలో చాలా వరకు ఫుడ్ ఇన్ఫెక్షన్ వార్తలు నా దృష్టికి వచ్చాయి.. అందుకే ఫుడ్ సేఫ్టీ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి నేరుగా తనిఖీలకు వచ్చాను.. చాలా వరకు హోటల్ అన్ హైజెనిక్ గా హోటల్స్ నిర్వహిస్తున్నారు.. కిచెన్ లో కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదు.. ఉడికించిన చికెన్ ను ఫ్రిజ్ లో పెట్టు రోజుల తరబడి వినియోగిస్తున్నారు.. డ్రైనేజీ సింక్ పక్కనే వండడం., చేతులకు ఎలాంటి గ్లౌజులు వాడకుండా నేరుగా చేతులతో తాకడం గమనించాం.. తనిఖీ చేసిన రెండు హోటల్స్ లో మా సిబ్బంది శాంపిల్స్ కలెక్ట్ చేశారు.. నిబంధనలు ఉల్లనగించిన హోటల్స్ పై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.. హోటల్ కి వచ్చే కస్టమర్లకు నాణ్యమైన ఫుడ్ అందించండం హోటల్ యాజమాన్యం బాధ్యత..’ అని ఆమె వ్యాఖ్యానించారు.
New Study: ‘‘జ్ఞాపకాలు మెదడుకు మాత్రమే పరిమితం కావు’’.. శరీరంలో ఇతర భాగాల్లో మెమోరీ ఫంక్షన్స్..